నేలకూలిన ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేర్లు.. 5% పతనం..

ABN , First Publish Date - 2022-09-08T18:10:11+05:30 IST

ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేర్లు(Interglobe Aviation shares) నేడు దారుణంగా పతనమయ్యాయి. గురువారం నాటి ఇంట్రా-డేలో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేర్లు 5 శాతం

నేలకూలిన ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేర్లు.. 5% పతనం..

ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేర్లు(Interglobe Aviation shares) నేడు దారుణంగా పతనమయ్యాయి. గురువారం నాటి ఇంట్రా-డేలో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేర్లు 5 శాతం పడిపోయి రూ. 1,885కి చేరుకున్నాయి. ఎయిర్‌లైన్ మొత్తం ఈక్విటీ(Total Equity)లో దాదాపు 5 శాతం బ్లాక్ డీల్స్(Black Deals) ద్వారా చేతులు మారాయి. ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ 'ఇండిగో(Indigo)' పేరుతో దేశీయ(Domestic), అంతర్జాతీయ షెడ్యూల్డ్(International Schedule) వాయు రవాణా సేవల(Air Transport services)ను అందించే వ్యాపారం(Business)లో నిమగ్నమై ఉంది. ఇది భారతీయ విమానయాన రంగం(Indian Aviation Sector)లో 54 శాతం మార్కెట్ వాటాతో అత్యంత సమర్థవంతమైన తక్కువ ధర క్యారియర్‌లలో ఒకటి కావడం విశేషం.


ఇండిగో కో-ప్రమోటర్ రాకేష్ గంగ్వాల్(IndiGo’s co-promoter Rakesh Gangwal) మాతృ సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌(Interglobe Aviation)లో దాదాపు 2,000 కోట్ల రూపాయల బ్లాక్ డీల్స్ ద్వారా 2.8 శాతం వరకు వాటాలను విక్రయించనున్నారు. జూన్ 30, 2022 నాటికి, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌లో రాకేశ్ గంగ్వాల్ 14.65 శాతం వాటాను కలిగి ఉండగా, అతని భార్య శోభా గంగ్వాల్(Shobha Gangwal) 8.39 శాతం వాటాను కలిగి ఉన్నారు. మొత్తం ప్రమోటర్లు 74.77 శాతం వాటాను కలిగి ఉన్నారు. రాకేష్ గంగ్వాల్ ఫిబ్రవరి 18, 2022 న ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(Non-Executive Director of InterGlobe Aviation) పదవికి రాజీనామా చేశారు. రాబోయే ఐదేళ్లలో కంపెనీలో వాటాను క్రమంగా తగ్గించుకుంటానని చెప్పారు.


Read more