Infinix Hot 20 5G: డ్యూయల్ 5జీ సిమ్స్‌తో మార్కెట్లోకి నయా మొబైల్.. అతి తక్కువ ధర, ఆకర్షణీయమైన ఫీచర్లు

ABN , First Publish Date - 2022-10-08T22:46:40+05:30 IST

‘హాట్ 20 5జీ’ పేరుతో గ్లోబల్ మార్కెట్‌లోకి విడుదల చేసిన ఈ ఫోన్ కనీస ధర దాదాపు రూ. 15 వేలు. అయితే, ర్యామ్, స్టోరేజ్ సామర్థ్యం ఆధారంగా ధరల్లో మార్పు ఉంటుంది.

Infinix Hot 20 5G: డ్యూయల్ 5జీ సిమ్స్‌తో మార్కెట్లోకి నయా మొబైల్.. అతి తక్కువ ధర, ఆకర్షణీయమైన ఫీచర్లు

న్యూఢిల్లీ: దేశంలో 5జీ సేవలు ప్రారంభమైన వేళ 5జీ స్మార్ట్‌ఫోన్ కోసం వెతుకుతున్న వినియోగదారులకు ఇది గొప్ప వార్తే. డ్యూయల్ 5జీ సిమ్స్‌తో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను ఇన్ఫినిక్స్ తీసుకొచ్చింది. ‘హాట్ 20 5జీ’ పేరుతో గ్లోబల్ మార్కెట్‌లోకి విడుదల చేసిన ఈ ఫోన్ కనీస ధర దాదాపు రూ. 15 వేలు.   అయితే, ర్యామ్, స్టోరేజ్ సామర్థ్యం ఆధారంగా ధరల్లో మార్పు ఉంటుంది. 


ఇన్ఫినిక్స్ హాట్ 20 5జీ స్పెసిఫికేషన్లు: 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ వరకు రీఫ్రెష్ రేట్, మీడియా టెక్ డైమెన్సిటీ 810 చిప్ సెట్, 4జీబీ ర్యామ్, 3జీబీ వర్చువల్ ర్యామ్, 128 అంతర్గత మెమరీ, 50 ఎంపీ ప్రైమరీ లెన్స్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 18 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, యూఎస్‌బీ ‘సి’ టైప్ చార్జర్, ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎక్స్ఓఎస్10.6 యూఐ ఆపరేటింగ్ సిస్టం కలిగిన ఈ ఫోన్ ధర మన కరెన్సీలో దాదాపు 15 వేలు.

 

గేమ్స్ ఆడినప్పుడు మొబైల్ వేడెక్కకుండా ప్రత్యేకంగా ‘ఫేస్ చేంజ్ కూలింగ్ సిస్టం’ను ఉపయోగించారు. అంతేకాదు, వై-ఫై సరిగా లేకున్నా, సిగ్నల్స్ బలహీనంగా ఉన్నా ఫోన్ ఆటోమెటిక్‌గా మొబైల్ డేటాకు మారిపోయేలా ‘లింక్ ప్లస్ 1.0’ ఫీచర్‌ను ఉపయోగించారు. బ్లాస్టర్ గ్రీన్, రేసింగ్ బ్లాక్, స్పేస్ బ్లూ కలర్ వేరియంట్లలో ఫోన్ అందుబాటులో ఉంది.  

Read more