యూఏఈ- భారత్‌ ‘స్వేచ్ఛా వాణిజ్య’ బంధం

ABN , First Publish Date - 2022-02-19T08:32:55+05:30 IST

భారత-యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది.

యూఏఈ- భారత్‌  ‘స్వేచ్ఛా వాణిజ్య’ బంధం

న్యూఢిల్లీ : భారత-యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. ప్రధాని నరేంద్ర మోదీ, యూఏఈ యువరాజు షేక్‌ మహ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ మధ్య వర్చువల్‌గా జరిగిన సమావేశం ఇందుకు వేదికైంది. కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌, యూఏఈ ఆర్థిక మంత్రి అబుల్లా బిన్‌ టౌక్‌ అల్‌ మర్రి ఇందుకు సంబంధించిన పత్రాలపై సంతకాలు చేశారు.


దీంతో రెండు దేశాల మధ్య ప్రస్తుతం 6,000 కోట్ల డాలర్లు ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యం ఐదేళ్లలో 10,000 కోట్ల డాలర్లకు చేరుతుందని యూఏఈలో భారత రాయబారి సంజయ్‌ సుధీర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) పేరుతో రెండు దేశాలు ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం రెండు దేశాలకు ఉభయ తారకంలా పని చేస్తుందని పారిశ్రామిక, వాణిజ్య సంఘాలు పేర్కొన్నాయి. 

Updated Date - 2022-02-19T08:32:55+05:30 IST