ఆక్వాకల్చర్‌ హెల్త్‌కేర్‌ రంగంలోకి

ABN , First Publish Date - 2022-10-05T09:33:01+05:30 IST

ఇండియన్‌ ఇమ్యునాలజికల్స్‌ లిమిటెడ్‌ (ఐఐఎల్‌) ఆక్వాకల్చర్‌ హెల్త్‌కేర్‌ విభాగంలోకి అడుగు పెట్టింది. చెరువుల్లో పెంచే రొయ్యలు, చేపల కోసం ఉత్పత్తులను విడుదల చేస్తున్నట్లు ప్రక

ఆక్వాకల్చర్‌ హెల్త్‌కేర్‌ రంగంలోకి

ఇండియన్‌ ఇమ్యునాలజికల్స్‌


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఇండియన్‌ ఇమ్యునాలజికల్స్‌ లిమిటెడ్‌ (ఐఐఎల్‌) ఆక్వాకల్చర్‌ హెల్త్‌కేర్‌ విభాగంలోకి అడుగు పెట్టింది. చెరువుల్లో పెంచే రొయ్యలు, చేపల కోసం ఉత్పత్తులను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. రొయ్యలు, చేపల కోసం వ్యాక్సిన్లతో సహా దశల వారీగా వివిధ హెల్త్‌కేర్‌ ఉత్పత్తులను విడుదల చేయనున్నట్లు ఐఐఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కే ఆనంద్‌ కుమార్‌ తెలిపారు. ఐఐఎల్‌ ఇప్పటికే మనుషులు, పశువులు, గొర్రెలు, పందులు, ఇతర పెంపుడు జంతువులకు వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తోంది. చెరువుల ద్వారా రొయ్యల ఉత్పత్తిలో భారత్‌ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. రొయ్యలకు వ్యాక్సిన్లు, ఇతర హెల్త్‌కేర్‌ ఉత్పత్తులను విడుదల చేయడం వల్ల యాంటీబయాటిక్స్‌ వినియోగం తగ్గుతుందని ఆనంద్‌ చెప్పారు.

Read more