stock markets: రెండు రోజుల ర్యాలీకి బ్రేక్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

ABN , First Publish Date - 2022-09-21T21:49:43+05:30 IST

వరుసగా రెండు రోజుల ర్యాలీకి బ్రేక్ పడింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లు బుధవారం సెషన్‌లో నష్టాలతో ముగిశాయి.

stock markets: రెండు రోజుల ర్యాలీకి బ్రేక్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

న్యూఢిల్లీ: వరుసగా రెండు రోజుల ర్యాలీకి బ్రేక్ పడింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లు(stock markets) బుధవారం సెషన్‌లో నష్టాలతో ముగిశాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ భేటీకి ముందు గ్లోబల్ మార్కెట్లలో పెద్దగా కదలికలు లేకపోవడం, ఉక్రెయిన్‌‌పై యుద్ధాన్ని మరింత ముమ్మరం చేసేందుకు రష్యా సన్నద్ధమవుతుండడం వంటి అంశాలు దేశీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు ఖాయమనే అంచనాల నేపథ్యంలో.. బీఎస్ఈ సెన్సెక్స్ 260 పాయింట్లు నష్టపోయి 59,456 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌‌ఈ నిఫ్టీ 98 పాయింట్లు క్షీణించి 17,718.35 వద్ద స్థిరపడింది.


పవర్‌గ్రిడ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్‌టీపీసీ, లార్సెస్ అండ్ టుబ్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, డాక్టర్ రెడ్డీస్, టీసీఎస్, భారతీ ఎయిర్‌టెల్ సెన్సెక్స్‌పై అత్యధికంగా నష్టపోయాయి. అయితే హిందుస్తాన్ యునిలీవర్, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహింద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్, మహింద్రాఅండ్‌మహింద్రా, నెస్లే షేర్లు లాభపడ్డాయి. బుధవారం మార్కెట్ల పరిస్థితిపై కోటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ సహజ్ అగర్వాల్ స్పందిస్తూ.. మార్కెట్లు ప్రస్తుతం దిద్దుబాటు దశలో ఉన్నాయన్నారు. సమీపభవిష్యత్‌లోనూ రుణాత్మక దిశగా పయనించొచ్చని విశ్లేషించారు.

Updated Date - 2022-09-21T21:49:43+05:30 IST