GDP: రెండవ త్రైమాసికం వృద్ధి రేటు 6.3 శాతమే

ABN , First Publish Date - 2022-11-30T22:00:52+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23 రెండవ త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 6.3 శాతం మేర వృద్ధి చెందింది.

GDP: రెండవ త్రైమాసికం వృద్ధి రేటు 6.3 శాతమే

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23 రెండవ త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ (Indian economy) 6.3 శాతం మేర వృద్ధి (GDP) చెందింది. ఈ మేరకు ప్రభుత్వ గణాంకాలు వెల్లడయ్యాయి. కాగా గత ఆర్థిక సంవత్సరం 2021-22 ఇదే త్రైమాసికంలో 8.4 శాతం వృద్ధి రేటు నమోదయ్యిందని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) డేటా పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్‌- జూన్‌ తొలి త్రైమాసికం వృద్ధి రేటు 13.5 శాతం పోల్చితే సగం మేర తక్కువేకావడం గమనార్హం. కాగా ఈ సంవత్సరం రెండో త్రైమాసికంలో 6.5 శాతం వృద్ధి నమోదవుతుందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా (ICRA) అంచనా వేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-11-30T22:01:48+05:30 IST