అత్యంత ఆకర్షణీయ రియల్టీ మార్కెట్లలో హైదరాబాద్‌కు రెండో స్థానం

ABN , First Publish Date - 2022-10-05T09:15:11+05:30 IST

దేశంలోని అత్యంత ఆకర్షణీయ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్లలో హైదరాబాద్‌ రెండో స్థానంలో నిలిచింది.

అత్యంత ఆకర్షణీయ రియల్టీ మార్కెట్లలో హైదరాబాద్‌కు రెండో స్థానం

దేశంలోని అత్యంత ఆకర్షణీయ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్లలో హైదరాబాద్‌ రెండో స్థానంలో నిలిచింది. దేశంలోని ఆరు అట్రాక్టివ్‌ రియల్టీ మార్కెట్లను అంచనా వేసేందుకు మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఎంఓఎ్‌ఫఎ్‌సఎల్‌) అభివృద్ధి చేసిన రియల్‌ ఎస్టేట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ మెట్రిక్‌(ఆర్‌ఈఐఎం) ఫ్రేమ్‌వర్క్‌లో హైదరాబాద్‌కు 4 స్కోర్‌ లభించింది. కాగా, 4.7 స్కోర్‌తో బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఆరు నగరాల్లో రియల్టీ మార్కెట్‌ వృద్ధి, ఇళ్ల ధరలు, గృహ నిల్వలు, భవిష్యత్‌ డిమాండ్‌ తదితర అంశాల ఆధారంగా నగరాలకు స్కోరింగ్‌ కేటాయించినట్లు సంస్థ వెల్లడించింది. 

Read more