హీరో మోటో తొలి విద్యుత్‌ స్కూటర్‌ విడా వీ1

ABN , First Publish Date - 2022-10-08T09:16:09+05:30 IST

ద్విచక్ర వాహన దిగ్గజం హీరోమోటో కార్ప్‌ విద్యుత్‌ వాహనాల విభాగంలోకి ప్రవేశించింది. తొలి విద్యుత్‌ స్కూటర్‌ విడా వీ1 విడుదల చేసింది.

హీరో మోటో తొలి విద్యుత్‌ స్కూటర్‌ విడా వీ1

ధర రూ.1.45 లక్షలు

జైపూర్‌: ద్విచక్ర వాహన దిగ్గజం హీరోమోటో కార్ప్‌ విద్యుత్‌ వాహనాల విభాగంలోకి ప్రవేశించింది. తొలి విద్యుత్‌ స్కూటర్‌ విడా వీ1 విడుదల చేసింది. రెండు వెర్షన్లలో ఇది అందుబాటులో ఉంటుంది. వాటిలో విడా వీ1 ప్లస్‌ ధర రూ.1.45 లక్షలు కాగా విడా వీ1 ప్రో ధర రూ.1.59 లక్షలు. ఒక చార్జింగ్‌తో వీ1 ప్లస్‌ 143 కిలోమీటర్లు, వీ1 ప్రో 165 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి. తొలి దశలో ఈ స్కూటర్లు బెంగళూరు, ఢిల్లీ, జైపూర్‌లలో అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత ఇతర నగరాలకు విస్తరిస్తారు. వీటి బుకింగ్స్‌ ఈ నెల 10 నుంచి, డెలివరీ డిసెంబరు రెండో వారం నుంచి ప్రారంభమవుతాయి. ఈ స్కూటర్లు రిమువబుల్‌ బ్యాటరీ, పోర్టబుల్‌ చార్జర్‌ కలిగి ఉంటాయని ఈ సందర్భంగా కంపెనీ చైర్మన్‌, సీఈఓ పవన్‌ ముంజాల్‌ తెలిపారు.

Read more