ట్రైబ్యునల్‌ ముందుకు ‘హీరో’ వివాదం

ABN , First Publish Date - 2022-02-19T08:30:57+05:30 IST

ముంజాల్‌ గ్రూప్‌ ప్రమోటర్ల వివాదం ఆర్బిట్రేషన్‌ ట్రైబ్యునల్‌కు చేరింది. హీరో గ్రూప్‌ ప్రమోటర్లలో ఒకరైన పవన్‌ కుమార్‌ ముంజాల్‌

ట్రైబ్యునల్‌ ముందుకు ‘హీరో’ వివాదం

న్యూఢిల్లీ: ముంజాల్‌ గ్రూప్‌ ప్రమోటర్ల వివాదం ఆర్బిట్రేషన్‌ ట్రైబ్యునల్‌కు చేరింది. హీరో గ్రూప్‌ ప్రమోటర్లలో ఒకరైన పవన్‌ కుమార్‌ ముంజాల్‌  తన విద్యు త్‌ వాహనాల (ఈవీ) వెంచర్‌కు ‘హీరో’ పేరు వాడుకోవడాన్ని విజయ్‌ కుమార్‌ ముంజాల్‌ ఢిల్లీ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఆస్తుల విభజన సమయంలో కుదిరిన కుటుంబ ఒప్పందానికి ఇది విరుద్దమని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. శుక్రవారం ఈ పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు ఈ విషయాన్ని ముగ్గురు సభ్యుల ఆర్బిట్రేషన్‌ ట్రైబ్యునల్‌కు నివేదిస్తున్నట్టు ప్రకటించింది. 

Read more