హెరిటేజ్‌ నుంచి ప్రీమియం బాదం మిల్క్‌

ABN , First Publish Date - 2022-03-16T08:17:52+05:30 IST

విలువ చేర్చిన ఉత్పత్తుల ఆదాయ వాటాను పెంచుకునే వ్యూహంలో భాగంగా హెరిటేజ్‌ ఫుడ్స్‌ మార్కెట్లోకి మరో ఉత్పత్తిని విడుదల చేసింది..

హెరిటేజ్‌ నుంచి  ప్రీమియం బాదం మిల్క్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): విలువ చేర్చిన ఉత్పత్తుల ఆదాయ వాటాను పెంచుకునే వ్యూహంలో భాగంగా హెరిటేజ్‌ ఫుడ్స్‌ మార్కెట్లోకి మరో ఉత్పత్తిని విడుదల చేసింది. ‘బాదం చార్జర్‌’ పేరుతో ప్రీమియం బాదం మిల్క్‌ను తాజాగా ప్రవేశపెట్టినట్లు హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారా బ్రహ్మణి తెలిపారు. ప్రీమియం బాదం మిల్క్‌లో పాదం పప్పు కూడా ఉంటుంది. ప్రతి త్రైమాసికంలో కనీసం ఒక కొత్త ఉత్పత్తిని (విలువ చేర్చిన) మార్కెట్లోకి విడుదల చేయాలని కంపెనీ నిర్ణయించిందన్నారు. ఇందులో భాగంగా గత కొద్ది త్రైమాసికాల్లో అనేక విలువ చేర్చిన ఉత్పత్తులను ప్రవేశపెడుతున్నామని.. దీనివల్ల మొత్తం ఆదాయంలో విలువ చేర్చిన ఉత్పత్తుల ఆదాయ వాటా క్రమంగా పెరుగుతోందని బ్రహ్మణి అన్నారు. 

Read more