భారీగా తగ్గిన బంగారం

ABN , First Publish Date - 2022-09-17T08:23:13+05:30 IST

అంతర్జాతీయ మార్కెట్లో డౌన్‌ట్రెండ్‌కు అనుగుణం గా దేశీయంగానూ విలువైన లోహాల ధరలు భారీగా తగ్గాయి. ముంబై

భారీగా తగ్గిన బంగారం

అంతర్జాతీయ మార్కెట్లో డౌన్‌ట్రెండ్‌కు అనుగుణం గా దేశీయంగానూ విలువైన లోహాల ధరలు భారీగా తగ్గాయి. ముంబై మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్లు) బంగారం శుక్రవారం రూ.585 మేర తగ్గి రూ.49,341కి దిగివచ్చింది. 22 క్యారెట్ల పసిడి రేటు తులానికి రూ.532 వరకు తగ్గి రూ.45,200 పలికింది. కిలో వెండి ఏకంగా రూ.1,186 తగ్గి రూ.55,144గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర గురువారం 2నెలల కనిష్ఠస్థాయికి జారుకుంది. ఔన్స్‌ (31.10 గ్రాము లు) గోల్డ్‌ రేటు  1,664 డాలర్లకు పడిపోయింది. 

Read more