క్రెడిట్, డెబిట్ కార్డులు వాడుతున్నారా..? భారీ మార్పులు చేసిన ఆర్‌బీఐ

ABN , First Publish Date - 2022-06-12T02:42:17+05:30 IST

దేశంలో డిజిటల్‌ లావాదేవీల చెల్లింపులు పెరిగాయి. ఈ-కామర్స్‌ వెబ్‌సైట్ల నుంచి సాధారణ దుకాణాల వరకు దాదాపు

క్రెడిట్, డెబిట్ కార్డులు వాడుతున్నారా..? భారీ మార్పులు చేసిన ఆర్‌బీఐ

న్యూఢిల్లీ: దేశంలో డిజిటల్‌ లావాదేవీల చెల్లింపులు పెరిగాయి. ఈ-కామర్స్‌ వెబ్‌సైట్ల నుంచి సాధారణ దుకాణాల వరకు దాదాపు అంతటా ఆన్‌లైన్‌ పేమెంట్‌ చేస్తున్నారు. అలాగే డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల వినియోగం పెరిగింది. ప్రస్తుతం డెబిట్, క్రెడిట్ కార్డులు వాడే విషయంలో రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కొత్త నిబంధనలు అమలు చేస్తోంది. అవేంటంటే...? 


క్రెడిట్, డెబిట్ కార్డుల విషయంలో జులై 1 నుంచి ఆర్‌బీఐ కొత్త నిబంధనలు అమలు చేయనుంది. టోకెనైజేషన్‌ అమలు గురించి రెండేళ్ల క్రితమే ఆర్‌బీఐ బ్యాంకులకు తెలియజేసింది. ఇందుకు సంబంధించి గతేడాది కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. జూన్‌ 30 నుంచి క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల సమాచారం భద్రపరచడాన్ని ఆర్బీఐ నిషేధించనుంది. పేమెంట్‌ అగ్రిగేటర్లు, పేమెంట్‌ గేట్‌వేలు, నాన్‌ బ్యాంక్‌ పేమెంట్‌ అగ్రిగేటర్లు, మర్చంట్స్‌కు మార్గదర్శకాలు జారీ చేస్తున్నట్లు ప్రకటించింది.  


టోకెనైజేషన్ అంటే ఏంటంటే.. మనం ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్స్‌ చేసే ముందు క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వివరాలను నమోదు చేస్తాం.. కానీ ఇక మీదట అలా చేయాల్సిన అవసరం లేదు. కేవలం మీ కార్డుకు సంబంధించిన టోకెన్‌ను నమోదు చేస్తే చాలు. తర్వాత కస్టమర్లు తమ కార్డులను టోకెన్ రిక్వెస్టర్‌ అందించే ఒక ప్రత్యేక యాప్‌ ద్వారా టోకెనైజ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ టోకెన్ రిక్వెస్టర్ వినియోగదారుడి అభ్యర్థనను కార్డ్ నెట్‌వర్క్‌కు పంపుతుంది. కార్డు జారీచేసిన సంస్థ అనుమతితో ఆఖర్లో టోకెన్‌ జారీ అవుతుంది.


Updated Date - 2022-06-12T02:42:17+05:30 IST