భయపెడుతున్న బంగారం.. మళ్లీ పెరిగింది..

ABN , First Publish Date - 2022-09-21T14:47:51+05:30 IST

వామ్మో బంగారం.. భయపెడుతోంది. బంగారం, వెండి ధరలు కూడా పరుగులు తీస్తున్నాయి. ఒక రోజు తగ్గిందని సంతోషించే లోపే..

భయపెడుతున్న బంగారం.. మళ్లీ పెరిగింది..

Gold and Silver Price : వామ్మో బంగారం.. భయపెడుతోంది. బంగారం, వెండి ధరలు కూడా పరుగులు తీస్తున్నాయి. ఒక రోజు తగ్గిందని సంతోషించే లోపే.. తర్వాతి రోజే పెరిగిపోతున్నాయి. ఇక తాజాగా బుధవారం (సెప్టెంబర్‌ 21)న 10 గ్రాముల బంగారంపై రూ.100 నుంచి రూ.110 వరకు పెరుగగా, కిలో వెండి ధరపై రూ.500లకు పైగా పెరిగింది. ఇది అసలు పెరగడంలా భావించకున్నా కూడా.. ఇప్పటికే బంగారం రోజువారీగా స్వల్పంగా పెరుగుతూనే రూ.50 వేలకు చేరుకుంది. ఇలాగే స్వల్పమే కదా అనుకుంటే రోజువారీగా పెరిగి మళ్లీ ఎక్కడికి వెళుతుందోనన్న భయం కొనుగోలుదారులను వెంటాడుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా ఉన్నాయి.


బంగారం ధరలు :


హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,950 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,130


విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,130


చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,920


ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,130


ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,290
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,180


కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,130


వెండి ధరలు..


హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.61,800


విజయవాడలో కిలో వెండి ధర రూ.61,800


చెన్నైలో కిలో వెండి ధర రూ.61,800


బెంగళూరులో కిలో వెండి ధర రూ.61,800


కేరళలో కిలో వెండి ధర రూ.61,800


ముంబైలో కిలో వెండి ధర రూ.57,200


ఢిల్లీలో కిలో వెండి ధర రూ.57,200

 

Read more