బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

ABN , First Publish Date - 2022-11-30T11:16:56+05:30 IST

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. నేడు బంగారం ధర అత్యంత స్వల్పంగా తగ్గింది.

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

Gold and Silver Price : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. నేడు బంగారం ధర అత్యంత స్వల్పంగా తగ్గింది. గత నాలుగు రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధర నేడు పెరగకుండా అంతో ఇంతో తగ్గడం ఊరట కలిగిస్తున్న విషయం. ఇక నేడు 22 గ్రాముల బంగారం ధర (10 గ్రాములు) రూ.48,460 ఉండగా.. 24 గ్రాముల బంగారం ధర రూ.48,560కు చేరుకుంది. 22, 24 గ్రాముల బంగారంపై రూ.100 మేర తగ్గింది. నిజానికి ఇలా రోజుల తరబడి బంగారం పెరగకపోవడం అనేది కొనుోలుదారులకు కలిసొస్తున్న అంశం. పెళ్లిళ్ల సీజన్‌ కావడం, బంగారానికి డిమాండ్‌ ఉన్న నేపథ్యంలోనూ ధరలు స్థిరంగా ఉండటం ఊరటనిచ్చే అంశంగా చెప్పొచ్చు. అయితే వెండిధరపై మాత్రం అత్యంత స్వల్పంగా పెరిగింది. కిలో వెండిపై రూ.100 మేర పెరిగింది. నిజానికి వెండి ధరను స్థిరమనే పరిగణించాలి. బుధవారం దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.

బంగారం ధర...

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,880.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.48,460

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 52,850.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.48,450

విశాఖలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 52,850.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 48,450

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 53,630.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 49,160

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,930.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 48,510

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53,040.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.48,610

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,880.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.48,460

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 68,100

విజయవాడలో కిలో వెండి ధర రూ. 68,100

విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 68,100

చెన్నైలో కిలో వెండి ధర రూ. 68,000

బెంగుళూరులో కిలో వెండి ధర రూ. 68,000

కేరళలో కిలో వెండి ధర రూ. 68,000

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 61,400

ముంబైలో కిలో వెండి ధర రూ. 61,400

Updated Date - 2022-11-30T11:18:12+05:30 IST

Read more