గుడ్‌న్యూస్.. ఇవాళ కూడా తగ్గిన బంగారం ధర

ABN , First Publish Date - 2022-11-24T11:41:45+05:30 IST

గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర నేడు కూడా తగ్గింది. మొత్తంగా గత మూడు రోజుల్లో బంగారం ధర తులంపై దాదాపు రూ.400 వరకూ తగ్గింది.

గుడ్‌న్యూస్.. ఇవాళ కూడా తగ్గిన బంగారం ధర

Gold and Silver Price : గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర నేడు కూడా తగ్గింది. మొత్తంగా గత మూడు రోజుల్లో బంగారం ధర తులంపై దాదాపు రూ.400 వరకూ తగ్గింది. ఇదొక పెద్ద తగ్గుదలలా భావించకున్నా కూడా గత నాలుగు రోజులుగా బంగారం పెరిగిందైలే లేదు. స్థిరంగా ఉండటమో లేదంటే స్వల్పంగా తగ్గడమో జరుగుతూ వస్తోంది. నేడు దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.100 తగ్గింది. దీంతో నేడు తులం బంగారం ధర (22 క్యారెట్లు) రూ.48,250కి చేరుకుంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.110 వరకూ తగ్గింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,640కి చేరుకుంది. ఇక వెండి ధర కూడా అత్యంత స్వల్పంగా తగ్గింది. దేశీయంగా కిలో వెండి రూ.200 మేర తగ్గి.. రూ.61,000 లుగా కొనసాగుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.

బంగారం ధర..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.48,250.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,640

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.48,250.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,640

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.48,960.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53,410

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.48,300.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,700

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.48,250.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,640

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.48,400.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,800

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.48,250.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,640

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.67,500

విజయవాడలో కిలో వెండి ధర రూ.67,500

చెన్నైలో కిలో వెండి ధర రూ.67,500

బెంగళూరులో కిలో వెండి ధర రూ.67,500

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.61,000

ముంబైలో కిలో వెండి ధర రూ.61,000

Updated Date - 2022-11-24T11:41:45+05:30 IST

Read more