GoDaddy: 1.5 మిలియన్ల మంది కస్టమర్లతో పదో వార్షికోత్సవాన్ని జరుపుకున్న ‘గోడాడీ’

ABN , First Publish Date - 2022-10-15T02:15:46+05:30 IST

ప్రపంచంలోనే అతిపెద్ద డొమైన్ నేమ్ రిజిస్ట్రార్ గో డాడా ఇంక్ (NYSE: GDDY) భారత్‌లో తన పదో వార్షికోత్సవాన్ని

GoDaddy: 1.5 మిలియన్ల మంది కస్టమర్లతో పదో వార్షికోత్సవాన్ని జరుపుకున్న ‘గోడాడీ’

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద డొమైన్ నేమ్ రిజిస్ట్రార్ గో డాడా ఇంక్ (NYSE: GDDY) భారత్‌లో తన పదో వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంది. ఈ దశాబ్దకాలంలో మూడు రెట్ల వృద్ధి సాధించిన గోడాడీకి దేశంలో ప్రస్తుతం 1.5 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఇందులో స్వతంత్ర చిరు వ్యాపారులు, గోడాడీ భాగస్వాములు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 20 మిలియన్‌ల మందికిపైగా పైగా వినియోగదారులు  కలిగిన గోడాడీ.. ప్రజలు తమ ఆలోచనలకు పేరు పెట్టుకునే ప్రాంగణంగా మారింది.  ప్రొఫెషనల్‌ వెబ్‌సైట్స్‌ నిర్మించుకోవడం, వినియోగదారులను ఆకర్షించడం, తమ ఉత్పత్తులను, సేవలను విక్రయించడం, తమ పనిని నిర్వహించడంలో సాయపడుతోంది.


గో డాడీ భారతీయ మార్కెట్‌లోకి 2012లో  40 మంది కస్టమర్‌ కేర్‌ ఏజెంట్లతో కార్యక్రమాలు ప్రారంభించింది. రోజుకు 300–400 కాల్స్‌ను నిర్వహించేది. ఇప్పుడా సంఖ్య 1000 మందికి చేరుకుంది. వీరు రోజుకు  3500 కాల్స్‌ చేస్తారు.  నెలకు 90వేలకు పైగా  మెస్సేజ్‌లను నిర్వహిస్తున్నారు. ఆరు ప్రాంతీయ భాషలు.. తమిళం, మరాఠీ, తెలుగు, గుజరాతీ, కన్నడ, మలయాళంలో సైతం ప్రచారం చేస్తోంది.  దీనితో పాటు హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ, ఆంగ్లం వంటి ఐదు భాషలలో కస్టమర్‌  కేర్‌ ఆఫరింగ్‌ అందిస్తోంది.


గోడాడీ ఇప్పుడు వర్డ్‌ ప్రెస్‌, వీపీఎస్‌ డెడికేటెడ్‌  సర్వర్లను సైతం అందిస్తోంది.  దేశంలో గోడాడీ పదేళ్లు పూర్తి చేసుకున్నందుకు అభినందనలు తెలుపుకుంటున్నట్టు నిక్సీ సీఈవో అనిల్ జైన్ అన్నారు.  గోడాడీ వైస్ ప్రెసిడెంట్, ఎండీ (ఇండియా) నిఖిల్‌ అరోరా మాట్లాడుతూ..  భారత్‌లో దాదాపు 63 మిలియన్ల చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్ధలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. దశాబ్దకాల తమ ప్రయాణాన్ని తరచి చూస్తే,  డిజిటల్‌గా వ్యాపార సంస్ధలకు తగిన సాధికారిత అందించేందుకు తోడ్పడటం పట్ల ఆనందంగా ఉందని అన్నారు. 

Updated Date - 2022-10-15T02:15:46+05:30 IST