మార్కెట్‌ ఆటుపోట్లకు సిద్ధం కండి

ABN , First Publish Date - 2022-02-16T05:54:30+05:30 IST

క్యాపిటల్‌ మార్కెట్లో ఏర్పడే ఆటుపోట్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా

మార్కెట్‌ ఆటుపోట్లకు సిద్ధం కండి

ఆర్థిక మంత్రి సీతారామన్‌


న్యూఢిల్లీ: క్యాపిటల్‌ మార్కెట్లో ఏర్పడే ఆటుపోట్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీని కోరారు. అమెరికా కేంద్ర బ్యాంక్‌ ‘ఫెడ్‌ రిజర్వ్‌’ వచ్చే నెల నుంచి వడ్డీ రేట్ల పెంపుతో పాటు నిధుల సరఫరా తగ్గించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి ఈ హెచ్చరిక చేయడం విశేషం. ఫెడ్‌ రిజర్వ్‌ తీసుకునే చర్యలతో భారత్‌తో సహా వర్థమాన దేశాల మార్కెట్లలో ఎఫ్‌ఐఐలు భారీ ఎత్తున అమ్మకాలకు దిగే అవకాశం ఉందని ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. క్యాపిటల్‌ మార్కెట్‌ లావాదేవీలను సులభతరం చేసేందుకు వీలుగా సెబీ మరిన్ని సంస్కరణలు చేపట్టాలని కూడా ఆర్థిక మంత్రి కోరారు. ముఖ్యంగా మదుపరుల ప్రయోజనాల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. ఈ్‌సజీ ప్రమాణాలకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని గ్రీన్‌ బాండ్స్‌ కోసం ప్రత్యేక వ్యవస్థను అభివృద్ధి చేయాలని కోరారు. కాగా లిస్టెడ్‌ కంపెనీల్లో చైర్మన్‌, ఎండీ పదవులను ఒకే వ్యక్తి కాకుండా వేర్వేరు వ్యక్తులను నియమించాలన్న నిబంధన స్వచ్ఛందమే తప్ప.. తప్పనిసరి కాదన్నారు. 


Updated Date - 2022-02-16T05:54:30+05:30 IST