గాయత్రి ప్రాజెక్ట్స్‌ దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభం

ABN , First Publish Date - 2022-11-16T02:51:29+05:30 IST

గాయత్రి ప్రాజెక్ట్స్‌ నుంచి దాదాపు రూ. 6 వేల కోట్ల మేర రుణ బకాయిలు రావాలని పేర్కొంటూ ఎస్‌బీఐ, కెనరా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తదితర బ్యాంకులు దాఖలు చేసిన దివాలా పరిష్కార పిటిషన్‌లను...

గాయత్రి ప్రాజెక్ట్స్‌ దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభం

ఎస్‌బిఐ పిటిషన్‌ను ఆమోదించిన ఎన్‌సీఎల్‌టీ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): గాయత్రి ప్రాజెక్ట్స్‌ నుంచి దాదాపు రూ. 6 వేల కోట్ల మేర రుణ బకాయిలు రావాలని పేర్కొంటూ ఎస్‌బీఐ, కెనరా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తదితర బ్యాంకులు దాఖలు చేసిన దివాలా పరిష్కార పిటిషన్‌లను హైదరాబాద్‌ ఎన్‌సీఎల్‌టీ ఆమోదించింది. ఈ మేరకు గాయ త్రి ప్రాజెక్ట్స్‌ దివాలా ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు మంగళ వారం తీర్పు వెలువరించింది. ఈ కంపెనీ తీసుకున్న రుణా లను 2015లో బ్యాంకులు రీషెడ్యూల్‌ చేసినప్పటికీ.. కంపెనీ రుణాల చెల్లింపులో విఫలం కావడంతో ఆయా బ్యాంకులు దివాళా పిటిషన్‌లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌లపై జ్యుడీషియల్‌ సభ్యుడు బీఎన్‌వీ రామకృష్ణ, టెక్నికల్‌ సభ్యుడు సత్యరాజన్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. గాయత్రి ప్రాజెక్ట్స్‌ కంపెనీ, బ్యాంకుల తరఫు వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. గాయత్రి ప్రాజెక్ట్స్‌ కంపెనీని కార్పొరేట్‌ దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్‌పీ) కింద పెట్టినట్లు ప్రకటించింది.

Updated Date - 2022-11-16T02:51:37+05:30 IST