మరింత తగ్గిన విదేశీ మారక నిల్వలు

ABN , First Publish Date - 2022-09-24T08:19:00+05:30 IST

రూపాయి పతనాన్ని నిలువరించేందుకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) తీసుకుంటున్న మద్దతు చర్యల కారణంగా విదేశీ మారకం నిల్వల క్షీణత కొనసాగుతోంది.

మరింత తగ్గిన విదేశీ మారక నిల్వలు

ముంబై: రూపాయి పతనాన్ని నిలువరించేందుకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) తీసుకుంటున్న మద్దతు చర్యల కారణంగా విదేశీ మారకం నిల్వల క్షీణత కొనసాగుతోంది. సెప్టెంబరు 16వ తేదీతో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వలు 521.9 కోట్ల డాలర్ల మేరకు క్షీణించి 54,565.2 కోట్ల డాలర్లకు తగ్గాయి. ఇదే వారంలో బంగారం నిల్వలు కూడా 45.8 కోట్ల డాలర్లు తగ్గి 3,818.6 కోట్ల డాలర్లకు చేరాయి.

Updated Date - 2022-09-24T08:19:00+05:30 IST