జూన్‌లో ఆర్ఐఎల్ నుంచి మారుతి వరకూ నష్టాల్లో పెద్ద కంపెనీల Mutual Funds

ABN , First Publish Date - 2022-07-19T19:40:52+05:30 IST

జూన్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries Ltd) నుంచి మారుతి సుజుకి(Maruthi Suzuki) వరకూ పెద్ద కంపెనీల

జూన్‌లో ఆర్ఐఎల్ నుంచి మారుతి వరకూ నష్టాల్లో పెద్ద కంపెనీల Mutual Funds

Mutual Funds : జూన్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries Ltd) నుంచి మారుతి సుజుకి(Maruthi Suzuki) వరకూ పెద్ద కంపెనీల మ్యూచువల్ ఫండ్స్ అన్నీ ఒడిదుడుకులను ఎదుర్కొవాల్సి వచ్చింది.  షేర్లలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (Mutual Funds) గరిష్టంగా ఆర్ఐఎల్ రూ. 2,177 కోట్లు, మారుతీ సుజుకీ (రూ. 2,045 కోట్లు), భారతీ ఎయిర్‌టెల్ (రూ. 1,310 కోట్లు) చొప్పున నష్టాలను ఎదుర్కొవాల్సి వచ్చింది. ఈ నెలలో భారతీ ఎయిర్‌టెల్(Bharati Airtel), ఆర్ఐఎల్ షేర్లు స్టేబుల్‌గా ఉన్నాయి. జూలై 1న, దేశీయ ముడి చమురు ఉత్పత్తి, ఇంధన ఎగుమతులపై ప్రభుత్వం విండ్‌ఫాల్ పన్నులు విధించడంతో ఆర్ఐఎల్ షేర్లు 7 శాతానికి పైగా క్రాష్ అయ్యాయి.


టెలికమ్యూనికేషన్స్ రంగంలోకి అదానీ(Adani) అడుగుపెట్టడంపై అనిశ్చితి కారణంగా ఈ మధ్య ఎయిర్‌టెల్ షేర్లు కూడా ఈ నెలలో క్షీణించాయి. అయితే ఆటోమోటివ్ రంగం ప్రస్తుతం మంచి ఊపుమీదుండటంతో మారుతీ సుజుకీ షేర్లు రేసులో కొనసాగాయి. జూన్‌లో ఈక్విటీ ఎంఎఫ్‌ల కోసం కొనుగోలు చేసిన మొదటి ఐదు జాబితాలో ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ ఉన్నాయి. ఫండ్ మేనేజర్లు ఈ రెండు కౌంటర్లలోని బలహీనతను ఉపయోగించుకుని మరిన్ని షేర్లను కూడబెట్టుకున్నారు.


టాటా స్టీల్ జూన్‌లో దేశీయ ఫండ్స్ ద్వారా గరిష్టంగా రూ. 876 కోట్ల అమ్మకాలను చూసింది. ఇది దేశంలోని ప్రముఖ స్టీల్‌మేకర్‌ అయిన టాటా స్టీల్ గత నెలలో 18 శాతం క్షీణించింది. అంబుజా సిమెంట్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మ్యూచువల్ ఫండ్స్ ఒక్కొక్కటి రూ.600 కోట్లకు పైగా ఉపసంహరించుకున్నాయి. ఓవర్సీస్ ఫండ్స్ రూ. 49,400 కోట్లు వెచ్చించినప్పటికీ... ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గత నెలలో రూ. 22,000 కోట్ల విలువైన షేర్లను నికరంగా కొనుగోలు చేశాయి.


Read more