టాప్ కంపెనీల్లో నాలిగింటికి... రూ. లక్ష కోట్లకు పైగా మార్కెట్ క్యాప్ డౌన్

ABN , First Publish Date - 2022-04-10T20:54:35+05:30 IST

టాప్-10లోని టీసీఎస్, ఇన్ఫోసిస్ సహా నాలుగు అతిపెద్ద కంపెనీల మార్కెట్ విలువ గత వారం రూ. 1,05,848.14 కోట్లు పడిపోయింది.

టాప్ కంపెనీల్లో నాలిగింటికి...   రూ. లక్ష కోట్లకు పైగా మార్కెట్ క్యాప్ డౌన్

న్యూఢిల్లీ : టాప్-10లోని టీసీఎస్, ఇన్ఫోసిస్ సహా నాలుగు అతిపెద్ద కంపెనీల మార్కెట్ విలువ గత వారం రూ. 1,05,848.14 కోట్లు పడిపోయింది. ఐటీ మేజర్లు టీసీఎస్, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ వాల్యుయేషన్ క్షీణించగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌యూఎల్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, భారతి ఎయిర్‌టెల్ కలిపి రూ. 51,628.12 కోట్లతో గెయినర్లుగా నిలిచాయి.


నాలుగు సంస్థలలో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) విలువ అత్యధికంగా రూ. 40,640.76 కోట్లు తగ్గి... రూ. 13,49,037.36 కోట్లకు చేరుకుంది.  ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్(ఎం-క్యాప్) రూ. 36,703.8 కోట్లు తగ్గి, రూ. 7,63,565.13 కోట్లకు చేరుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్‌ఐఎల్) మార్కెట్ వాల్యుయేషన్ రూ. 25,503.68 కోట్లు క్షీణించి, రూ. 17,70,205.42 కోట్లకు చేరుకోగా, బజాజ్ ఫైనాన్స్ రూ. 2,999.9 కోట్లు తగ్గి... రూ.  4,45,810.84 కోట్లకు చేరుకుంది. ఇక... ఇందుకు విరుద్ధంగా...  హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్(హెచ్‌యూఎల్) ఎం క్యాప్ రూ.  24,048.06 కోట్లు పెరిగి... రూ. 5,12,857.03 కోట్లకు చేరుకుంది. ఇక... ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 12,403.56 కోట్లు పెరిగి... రూ. 5,24,180.57 కోట్లకు చేరుకుంది. 

Read more