Big Diwali Sale: ఫ్లిప్‌కార్ట్‌ దీపావళి ఆఫర్.. అంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్ ఇంత తక్కువకే వస్తుంటే ఎగబడి కొంటారేమో..!

ABN , First Publish Date - 2022-10-11T18:33:05+05:30 IST

దసరాకు ఆఫర్లతో వినియోగదారులకు భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్ దీపావళి (Flipkart Big Diwali Sale) సందర్భంగా మరోమారు వినియోగదారులను..

Big Diwali Sale: ఫ్లిప్‌కార్ట్‌ దీపావళి ఆఫర్.. అంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్ ఇంత తక్కువకే వస్తుంటే ఎగబడి కొంటారేమో..!

దసరాకు ఆఫర్లతో వినియోగదారులకు భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్ దీపావళి (Flipkart Big Diwali Sale) సందర్భంగా మరోమారు వినియోగదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా అక్టోబర్ 11 నుంచి 16 వరకూ Big Diwali Sale పేరుతో ఆఫర్లకు తెరలేపింది. పలు స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లను (SmartPhones) ప్రకటించింది. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది Samsung Galaxy Z Flip 3 స్మార్ట్‌ఫోన్ గురించి. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల కొనాలని భావిస్తున్న వారికి ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. అసలు ధర కంటే దాదాపు రూ.36,000 తక్కువ ధరకే Samsung Galaxy Z Flip 3 ఫ్లిప్‌కార్ట్ దివాళి సేల్‌లో వినియోగదారుడు సొంతం చేసుకునే వీలుంది. సామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ఫోన్ గతేడాది మార్కెట్లో విడుదలయింది.



ఫ్లిప్‌కార్ట్ ప్రకటన ప్రకారం.. 95,999 రూపాయల విలువైన Samsung Galaxy Z Flip 3 ఫోన్ Flipkart Big Diwali Sale సందర్భంగా 59,999 రూపాయలకే అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ సామర్థ్యంతో Samsung Galaxy Z Flip 3 ఉండటం గమనార్హం. కస్టమర్లు ఈ సేల్‌లో కొటాక్, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులపై 1000 రూపాయల వరకూ డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాదు.. ఎక్సేంజ్ ఆఫర్‌ కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంది. బిగ్ దివాళి సేల్‌లో 21,900 రూపాయల వరకూ ఎక్సేంజ్‌ తగ్గింపు పొందొచ్చు. 6.7 అంగుళాల డైనమిక్ మెయిన్ డిస్‌ప్లే, 2X AMOLED display, 120Hz maximum refresh rate, 1.9-inch Super AMOLED cover display, 60Hz refresh rate ఫీచర్లు ఈ ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకత. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 పనిచేస్తుంది.



అయితే.. బ్యాటరీ సామర్థ్యం ఒక్కటే ఈ ఫోన్‌ను కొనాలని భావించే వారిని నిరుత్సాహపరిచే అంశం. కేవలం 3,300mAh Lithium-ion Battery సామర్థ్యంతో Samsung Galaxy Flip 3 ఫోన్ తయారైంది. ఇక బ్యాక్ కెమెరా విషయానికొస్తే.. 12 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్‌లెన్స్ కెమెరాతో ఈ ఫోన్‌ను రూపొందించారు. ఆటో ఫ్రేమింగ్, క్విక్ షాట్, నైట్ మోడ్ ఫీచర్లు ఈ ఫోన్‌లోని కెమెరా ప్రత్యేకత. ఫ్రంట్ కెమెరా విషయానికొస్తే.. 10 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్‌లో ఉంది. కెమెరా క్వాలిటీ విషయంలో ఈ ఫోన్ ఇతర ప్రీమియం ఫోన్లకు ఏమాత్రం తగ్గదనే చెప్పాలి. కనెక్టివిటీ గురించి చెప్పుకోవాల్సి వస్తే.. Samsung Galaxy Z Flip 3 5జీ స్మార్ట్‌ఫోన్ కావడం విశేషం. ఇదిలా ఉండగా.. శామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్‌లోని మరో స్మార్ట్‌ఫోన్‌పై కూడా ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌లో భారీ డిస్కౌంట్ ప్రకటించింది. Samsung Galaxy S21 FE 5G స్మార్ట్‌ఫోన్‌పై 19,000 రూపాయల డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఈ సంవత్సరం జనవరిలో మార్కెట్‌లో విడుదలయిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర 54,999 రూపాయలు ఉండేది. ఫ్లిప్‌కార్ట్ దివాళి సేల్‌లో 35,999 రూపాయలకే Galaxy S21 FE 5G స్మార్ట్‌ఫోన్‌‌ను పొందొచ్చు.

Read more