SGMA: హైటెక్స్‌లో ఐదో ఎడిషన్ యూనిఫామ్ అండ్ మాన్యుఫ్యాక్చరర్స్ ఫెయిర్.. తొలిసారి హైదరాబాద్‌లో!

ABN , First Publish Date - 2022-12-08T18:36:44+05:30 IST

కరోనా కారణంగా దాదాపు రెండేళ్ల విరామం తర్వాత హైదరాబాద్‌లోని హైటెక్స్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ వద్ద ఐదో ఎడిషన్

SGMA: హైటెక్స్‌లో ఐదో ఎడిషన్ యూనిఫామ్ అండ్ మాన్యుఫ్యాక్చరర్స్ ఫెయిర్.. తొలిసారి హైదరాబాద్‌లో!

హైదరాబాద్: కరోనా కారణంగా దాదాపు రెండేళ్ల విరామం తర్వాత హైదరాబాద్‌లోని హైటెక్స్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ వద్ద ఐదో ఎడిషన్ యూనిఫామ్ అండ్ గార్మెంట్స్ మాన్యుఫ్యాక్చరర్స్ ఫెయిర్ 2022 ప్రారంభమైంది. సోలాపూర్‌ గార్మెంట్స్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ (SGMA) నిర్వహిస్తున్న ఈ ఫెయిర్‌ ఈ నెల 9వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ ఫెయిర్‌ను ప్రారంభించిన అనంతరం మహారాష్ట్ర టెక్స్‌టైల్స్‌ శాఖ మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుభాష్‌ దేశ్‌ముఖ్‌ మాట్లాడుతూ.. యూనిఫామ్ గార్మెంట్‌ తయారీదారులు, యూనిఫామ్ ఫ్యాబ్రిక్‌ తయారీదారులు, యూనిఫామ్ యాక్సెసరీల తయారీదారులు ఈ షోలో పాల్గొన్నట్టు పేర్కొన్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా సోలాపూర్‌ గార్మెంట్‌ అసొసియేషన్‌‌ను అభినందిస్తున్నట్టు చెప్పారు. దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగానూ ఇది అతిపెద్ద యూనిఫామ్ వేదికగా నిలుస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తయారీదారుల ఈ ఫెయిర్‌లో పాల్గొంటున్నందుకు సంతోషంగా ఉందన్నారు.

సోలాపూర్‌ గార్మెంట్స్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ గత ఆరేళ్లుగా ఇండియాను యూనిఫామ్ సోర్సింగ్‌ హబ్‌గా మార్చేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. సుప్రసిద్ధ తయారీదారులైన డీలర్లు, హోల్‌సేలర్లు ఈ ఫెయిర్‌లో పాలుపంచుకుంటున్నారు. వీరిలో మఫత్‌లాల్‌, ఎస్‌ కుమార్‌, ఓమ్యాక్స్‌, స్పార్ష్‌, శుభాటెక్స్‌, గంగోత్రి, సంగం వంటివి ఉన్నాయి.

సోలాపూర్‌ గార్మెంట్స్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ డైరెక్టర్ విజయ్ దకాలియా మాట్లాడుతూ.. యునిఫామ్స్, ఫ్యాన్సీ గార్మెంట్స్‌, యునిఫామ్ ఫ్యాబ్రిక్‌ తయారీదారులు తమ ఉత్పత్తులను తొలిసారి తెలంగాణలోని హైదరాబాద్‌లో ఒకే చోట ప్రదర్శిస్తున్నట్టు చెప్పారు. మహారాష్ట్ర వెలుపల ఈ ఫెయిర్‌ నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. మహారాష్ట్ర టెక్స్‌టైల్స్‌ డైరెక్టర్‌ పి. శివశంకర్‌ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం బీ2బీ ఏరీనాను ప్రత్యేకంగా సందర్శక కొనుగోలుదారుల ప్రయోజనార్థం ఏర్పాటు చేసినట్టు చెప్పారు.

కాగా, ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర మాజీ మహారాష్ట్ర టెక్స్‌టైల్స్‌ శాఖ మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుభాష్‌ దేశ్‌ముఖ్‌, ట్రేడ్‌ కౌన్సిలర్‌, కెన్యా హై కమిషన్‌ జరేడ్‌ మావియేకా, మహారాష్ట్ర టెక్స్‌టైల్స్‌ డైరెక్టర్‌ పి. శివశంకర్‌, ఎంఎస్‌ఎంఈ, అదనపు డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ డి. చంద్రశేఖర్‌, ఎంఎస్‌ఎంఈ డైరెక్టర్‌ అశోక్‌ గోఖే, మహావీర్‌ టెక్స్‌టైల్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ ప్రకాష్‌ దకాలియా, శ్రీ సోలాపూర్‌ రెడీమేడ్‌ కపాడ్‌ ఉత్పాదక్‌ సంఘ్‌ (SSRKUS) అధ్యక్షుడు నీలేశ్ షా, ఉగాండా, కెన్యా, కజికిస్థాన్ సహా ఐదు దేశాల హై కమిషన్‌ల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-08T18:36:45+05:30 IST