Facebook: ఉద్యోగులతో జుకర్‌బర్గ్ సమావేశం.. షాకింగ్ నిర్ణయం!

ABN , First Publish Date - 2022-10-09T01:09:28+05:30 IST

చిన్నా చితక కంపెనీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులనే ప్రస్తుతం Facebook కూడా ఎదుర్కొంటోంది. ఆ సమస్యల నుంచి బయటపడేందుకు సంస్థ సీఈఓ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగులతో సమావేశం సందర్భంగా కీలక వ్యాఖ్య

Facebook: ఉద్యోగులతో జుకర్‌బర్గ్ సమావేశం.. షాకింగ్ నిర్ణయం!

ఇంటర్నెట్ డెస్క్: చిన్నా చితక కంపెనీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులనే ప్రస్తుతం Facebook కూడా ఎదుర్కొంటోంది. ఆ సమస్యల నుంచి బయటపడేందుకు సంస్థ సీఈఓ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగులతో సమావేశం సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారనే వార్త ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


మార్క్ జుకర్‌బర్గ్ కొద్ది రోజుల క్రితం ఉద్యోగులతో ఎప్పటిలాగే వీక్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన Facebook CEO.. కీలక విషయాలను వెల్లడించారట. సంస్థలో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్యలో 15శాతం(దాదాపు 12వేల మందిని) మందిని తొలగించేందుకు సిద్ధం అయినట్టు చెప్పారట. పని తీరు సరిగా లేని ఉద్యోగుల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారట.  పని తీరు బాగాలేని ఉద్యోగులను పీఐపీ (పర్ఫామెన్స్ ఇంప్రూమెంట్ ప్లాన్)లో చేర్చి.. తర్వాత క్రమంగా వారిని తొలగించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని ఫేస్‌బుక్ ప్రతినిధులు కూడా స్పష్టం చేస్తున్నారు. 


ఆర్థికమాంద్యం రావొచ్చనే ఊహాగానాల మధ్య ఖర్చులు తగ్గించుకోవడం కోసమే ఫేస్‌బుక్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా.. కొత్త నియామకాలను కూడా నిలిపి వేస్తున్నట్టు గత వారం ఫేస్‌బుక్ ప్రకటించిన విషయం తెలిసిందే. కేవలం ఫేస్‌బుక్ మాత్రమే కాకుండా Apple, Microsoft, Google వంటి సంస్థలు కూడా ఖర్చులు తగ్గించుకోవడంపై దృష్టిసారించాయి. కొత్త నియామకాలను నిలిపివేయడంతోపాటు పని తీరు బాగా లేని ఉద్యోగులకు పింక్ స్లిప్‌తను జారీ చేస్తున్నాయి. 


Updated Date - 2022-10-09T01:09:28+05:30 IST