రూ.350 కోట్లతో ఫిలాటెక్స్‌ ఫ్యాషన్స్‌ విస్తరణ

ABN , First Publish Date - 2022-11-30T01:21:36+05:30 IST

సాక్సుల తయారీ సంస్థ ఫిలాటెక్స్‌ ఫ్యాషన్స్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌ఎఫ్‌ఎల్‌).. రూ.350 కోట్ల పెట్టుబడితో భారీ ఎత్తున విస్తరణ ప్రణాళికలు చేపడుతున్నట్లు ...

రూ.350 కోట్లతో ఫిలాటెక్స్‌ ఫ్యాషన్స్‌ విస్తరణ

హైదరాబాద్‌: సాక్సుల తయారీ సంస్థ ఫిలాటెక్స్‌ ఫ్యాషన్స్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌ఎఫ్‌ఎల్‌).. రూ.350 కోట్ల పెట్టుబడితో భారీ ఎత్తున విస్తరణ ప్రణాళికలు చేపడుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం కంపెనీ హైదరాబాద్‌లో ఏటా 70 లక్షల సాక్సుల తయారీ సామర్థ్యం గల ప్లాంట్‌ను నిర్వహిస్తోంది. ప్రీమియం క్వాలిటీ సాక్సుల తయారీలో ఇది అతిపెద్ద యూనిట్‌ అని కంపెనీ తెలిపింది. కాగా దేశీయ మార్కెట్లో కార్యకలాపాలను విస్తరించేందుకు రూ.350 కోట్ల పెట్టుబడితో కంపెనీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 70 లక్షల నుంచి 3 కోట్లకు పెంచ నున్నట్లు పేర్కొంది. అదనంగా 500 మెషిన్ల ఏర్పాటుతో పాటు 2,000 మందికి నేరుగా ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. మరోవైపు విస్తరణలో భాగంగా శ్రీలంకకు చెందిన ఇసబెల్లా ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 51 శాతం వాటాను 75.5 లక్షల కోట్ల డాలర్లకు కొనుగోలు చేయనున్నట్లు ఫిలాటెక్స్‌ వెల్లడించింది. షేర్‌ సబ్‌స్ర్కిప్షన్‌ విధానంలో ఈ వాటాలను చేజిక్కించుకునేందుకు ప్రస్తుతం చర్చలు సాగిస్తున్నట్లు తెలిపింది. కాగా ప్రిఫరెన్షియల్‌ షేర్ల కేటాయింపు ద్వారా కంపెనీ పెయిడప్‌ క్యాపిటల్‌ను రూ.48.40 కోట్ల నుంచి రూ.250 కోట్ల పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొంది.

Updated Date - 2022-11-30T01:21:36+05:30 IST

Read more