లాట్‌ మొబైల్స్‌లో దసరా, దీపావళి ధమాకా ఆఫర్లు

ABN , First Publish Date - 2022-10-02T09:50:22+05:30 IST

మల్టీ బ్రాండ్‌ మొబైల్‌ రిటైల్‌ చెయిన్‌ లాట్‌ మొబైల్స్‌.. దసరా, దీపావళి ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.

లాట్‌ మొబైల్స్‌లో దసరా, దీపావళి  ధమాకా ఆఫర్లు

హైదరాబాద్‌: మల్టీ బ్రాండ్‌ మొబైల్‌ రిటైల్‌ చెయిన్‌ లాట్‌ మొబైల్స్‌.. దసరా, దీపావళి ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్‌ యం అఖిల్‌ మాట్లాడుతూ.. పండగల సందర్భంగా తమ షోరూమ్‌లన్నింటిలో అన్ని బ్రాండెడ్‌ మొబైల్స్‌, స్మార్ట్‌ టీవీలు, లాప్‌టాప్స్‌, స్మార్ట్‌ వాచీలు సహా లేటెస్ట్‌ యాక్సెసరీస్‌ అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. అంతేకాకుండా ఈసారి లాట్‌లో ఇన్వర్టర్లు,  ప్రింటర్లు కూడా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు అఖిల్‌ తెలిపారు. దసరా, దీపావళి పండగల సందర్భంగా దక్షిణాదిలో తొలిసారిగా కేవలం లాట్‌ మొబైల్స్‌లో ప్రతి స్మార్ట్‌ పోన్‌ కొనుగోలుపై ఫైర్‌ బోల్ట్‌ కాలింగ్‌ వాచీ, టవర్‌ ఫ్యాన్‌, టీడబ్ల్యూఎస్‌ ఎయిర్‌పోడ్స్‌, పోర్టబుల్‌ స్పీకర్‌, నెక్‌ బ్యాండ్‌, హోమ్‌ ధియేటర్‌.. కాంబో ఆఫర్స్‌తో లభిస్తాయన్నారు. స్మార్ట్‌ టీవీలు రూ.8,999, లాప్‌టాప్స్‌ 17,499కే లభిస్తాయని పేర్కొన్నారు. అలాగే ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్స్‌పై 7.5 శాతం వరకు ఇన్‌స్టంట్‌ క్యాష్‌బ్యాక్‌ లభిస్తుందని లాట్‌ మొబైల్స్‌ తెలిపింది. అంతేకాకుండా ప్రీమియం స్మార్ట్‌ ఫోన్స్‌పై రూ.8,000 వరకు ఎక్స్ఛేంజీ బోనస్‌, స్మార్ట్‌వాచెస్‌ కొనుగోలుపై 75 శాతం వరకు తగ్గింపు, ఒప్పో మొబైల్స్‌ కొనుగోలుపై జీరో డౌన్‌పేమెంట్‌తో పాటు రూ.10 లక్షల వరకు గెలుచుకునే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం లాట్‌ మొబైల్స్‌ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 150కి పైగా షోరూమ్స్‌ను నిర్వహిస్తోంది.

Read more