మళ్లీ కో-వర్కింగ్‌ స్పేస్‌కు గిరాకీ

ABN , First Publish Date - 2022-12-06T01:16:04+05:30 IST

సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగులు మళ్లీ కార్యాలయాలకు వస్తున్నందున ప్లగ్‌-అండ్‌-ప్లే, సర్వీ్‌స్డ/మేనేజ్డ్‌ కో-వర్కింగ్‌ స్పేస్‌కు గిరాకీ బాగా పెరుగుతోంది...

మళ్లీ కో-వర్కింగ్‌ స్పేస్‌కు గిరాకీ

ద్వారక ఇన్‌ఫ్రా ఎండీ ప్రదీప్‌ రెడ్డి

స్టార్ట్‌పల కోసం ‘ద్వారక ప్రైడ్‌’

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగులు మళ్లీ కార్యాలయాలకు వస్తున్నందున ప్లగ్‌-అండ్‌-ప్లే, సర్వీ్‌స్డ/మేనేజ్డ్‌ కో-వర్కింగ్‌ స్పేస్‌కు గిరాకీ బాగా పెరుగుతోంది. కంపెనీలు హైబ్రిడ్‌ విధానాన్ని అనుసరిస్తున్నాయి. కొన్ని రోజులు కొంత మంది ఉద్యోగులు, మరికొన్ని రోజులు మరికొంత మంది ఉద్యోగులు ఆఫీసుకు వచ్చే విధంగా సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయి. దీంతో పూర్తి స్థాయి సామర్థ్యంతో కార్యాలయ స్థలాన్ని తీసుకోకుండా కో-వర్కింగ్‌ స్పేస్‌ను కంపెనీలు ఎంచుకుంటున్నాయని ద్వారక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రదీప్‌ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయం గా బహుళ జాతి కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నందున ఉద్యోగులు కూడా కార్యాలయాలకు వచ్చేందుకు మొగ్గు చూపుతున్నారని వివరించారు. స్టార్ట్‌పల కోసమే ప్రత్యేకంగా ‘ద్వారక ప్రైడ్‌’ పేరుతో కొత్త కో-వర్కింగ్‌ సదుపాయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

కొత్తగా 4,500 సీట్లు: ఆఫీస్‌ స్పేస్‌, కో-వర్కింగ్‌ స్పేస్‌ రంగంలోని ద్వారక ఇన్‌ఫ్రా 2024 మార్చి నాటికి ఆరు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించనుంది. వీటి మొత్తం కో-వర్కింగ్‌ స్పేస్‌ 2 లక్షల చదరపు అడుగులు ఉంటుందని.. 4,500 సీట్లు అందుబాటులోకి వస్తాయని ప్రదీప్‌ రెడ్డి, డైరెక్టర్‌ దీప్నా రెడ్డి తెలిపారు. 620 సీట్ల సామర్థ్యంతో హైటెక్‌ సిటీ సమీపంలో స్టార్ట్‌పల కోసం ‘ద్వారక ప్రైడ్‌’ను ప్రారంభించినట్లు చెప్పారు.

చిన్న పట్టణాల్లోకి విస్తరణ: తాన్లా సొల్యూషన్స్‌, మెడికవర్‌ హాస్పిటల్స్‌, రామ్‌ ఇన్ఫో వంటి దాదాపు 100కు పైగా కంపెనీలు ద్వారక ఇన్‌ఫ్రాకు ఖాతాదారులుగా ఉన్నాయి. వచ్చే రెండేళ్లలో రూ.30-40 కోట్ల పెట్టుబడులను పెట్టనున్నాం. భవిష్యత్తులో తెలంగాణలో వరంగల్‌, ఏపీలో తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలల్లో ఆఫీస్‌ స్పేస్‌ సేవలను అందించనున్నట్లు దీప్నా రెడ్డి తెలిపారు.

Updated Date - 2022-12-06T01:16:14+05:30 IST