డెలివరీ సిబ్బంది నెట్‌వర్క్ ద్వారా డాబర్ శ్రేణి ఉత్పత్తులు ఇండేన్ కుటుంబాలకు... ఐఓసీఎల్-డాబర్ భాగస్వామ్యం...

ABN , First Publish Date - 2022-02-24T01:52:13+05:30 IST

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్)తో డాబర్ బుధవారం భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు ప్రకటించింది, ఇందులో భాగంగా... ప్రభుత్వ యాజమాన్యంలోని రిఫైనర్ కు చెందిన ఎల్‌పీజీ పంపిణీదారులు స్వదేశీ ఎఫ్‌ఎంసీజీ మేజర్‌కు రిటైల్ వ్యాపార భాగస్వాములు కానున్నారు.

డెలివరీ సిబ్బంది నెట్‌వర్క్ ద్వారా  డాబర్ శ్రేణి ఉత్పత్తులు ఇండేన్ కుటుంబాలకు...   ఐఓసీఎల్-డాబర్ భాగస్వామ్యం...

* 14 కోట్ల ఇండేన్ ఎల్‌పీజీ వినియోగదారుల కుటుంబాలకు డాబర్ ఉత్పత్తులు

హైదరాబాద్ : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్)తో డాబర్ బుధవారం భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు ప్రకటించింది, ఇందులో భాగంగా...  ప్రభుత్వ యాజమాన్యంలోని రిఫైనర్ కు చెందిన ఎల్‌పీజీ  పంపిణీదారులు స్వదేశీ ఎఫ్‌ఎంసీజీ మేజర్‌కు రిటైల్ వ్యాపార భాగస్వాములు కానున్నారు. ఈ భాగస్వామ్యం దేశమంతటా దాదాపు 14 కోట్ల ఇండేన్ ఎల్‌పీజీ వినియోగదారుల కుటుంబాలకు డాబర్ ఉత్పత్తుల శ్రేణికి సహకరించనుంది. ఈ క్రమంలో విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటన మేరకు వివరాలిలా ఉన్నాయి. 


ఒప్పందంలో భాగంగా... ఐఓసీఓల్ ఇండేన్ ఎల్‌పీజీ పంపిణీదారులు డాబర్‌కు రిటైల్ వ్యాపార భాగస్వాములు కానున్నారు. సంబంధిత డెలివరీ సిబ్బంది నెట్‌వర్క్ ద్వారా  డాబర్ శ్రేణి ఉత్పత్తులను నేరుగా ఇండేన్ ఎల్‌పీజీ వినియోగదారుల కుటుంబాలకు చేరనున్నాయి. మొత్తం విలువ గొలుసును, ప్రత్యేకించి ఇండేన్ ఎల్‌పీజీ వినియోగదారుల కనెక్ట్ చేయడానికి ఇండియన్ ఆయిల్, డాబర్ సాంకేతిక వ్యవస్థ ఇంటిగ్రేషన్‌ను చేపట్టనున్నాయి. ‘ఈ క్రమంలో... భారతీయ గృహాలకు ఇండియన్ ఆయిల్ ఉత్పత్తులనందించడానికి డాబర్‌కు సాయపడుతుందని సంబంధిత ప్రకటన వెల్లడించింది. డాబర్ ఇండియా సీఈఓ మోహిత్ మల్హోత్రా ఈ సందర్భంగా  మాట్లాడుతూ... రెండు అతిపెద్ద భారతీయ బ్రాండ్‌ల భాగస్వామ్యం రెండు కంపెనీల విలువను మరింతగా  పెంచుతుంది’ అని వ్యాఖ్యానించారు. 

Read more