5జీ ప్లాన్లపై కస్టమర్ల మోజు

ABN , First Publish Date - 2022-09-29T09:25:19+05:30 IST

దేశంలో మొబైల్‌ కస్టమర్లు 5జీ ప్లాన్ల పట్ల తీవ్ర మోజుతో ఉన్నారు.

5జీ ప్లాన్లపై కస్టమర్ల మోజు

న్యూఢిల్లీ : దేశంలో మొబైల్‌ కస్టమర్లు 5జీ ప్లాన్ల పట్ల తీవ్ర మోజుతో ఉన్నారు. 5జీ ప్లాన్ల కోసం ప్రస్తుత ప్లాన్‌ ధరల కన్నా 45 శాతం ప్రీమియం ధర చెల్లించేందుకు కూడా వారు సిద్ధంగా ఉన్నారు. ఎరిక్సన్‌ నిర్వహించిన అధ్యయనంలో ఇది తేలింది. మరి కొద్ది రోజుల్లో 5జీ సేవలు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఈ సర్వే ప్రాధాన్యత సంతరించుకుంది. 5జీ సేవల కోసం వినియోగదారుల సంసిద్ధత భారతదేశంలోనే అత్యధికంగా ఉందని ఆ సంస్థ తాజా నివేదికలో తెలిపింది. 5జీ సేవలు ఇప్పటికే ప్రారంభమైన బ్రిటన్‌, అమెరికాలతో పోల్చితే భారతదేశంలో 5జీ మోజు గల వారి సంఖ్య రెండు రెట్లు అధికంగా ఉన్నట్టు తేల్చింది. గత రెండేళ్లుగా భారతదేశంలో 5జీ సదుపాయం ఉన్న స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుల సంఖ్య మూడు రెట్లు పెరిగిందని పేర్కొంది.

Read more