క్రిప్టో రుణదాత వాయేజర్... ‘దివాళా’

ABN , First Publish Date - 2022-07-06T21:17:31+05:30 IST

క్రిప్టో రుణదాత, టోరంటోలో లిస్టై ఉన్న వాయేజర్ కంపెనీ... దివాళా పిటీషన్‌ను దాఖలు చేసింది.

క్రిప్టో రుణదాత వాయేజర్... ‘దివాళా’

టోరంటో : క్రిప్టో రుణదాత, టోరంటోలో లిస్టై ఉన్న వాయేజర్ కంపెనీ... దివాళా పిటీషన్‌ను దాఖలు చేసింది. ఉపసంహరణలు, ట్రేడింగ్, డిపాజిట్లను నిలిపివేసిన వారం తర్వాత... దివాళా కోసం దాఖలు చేసినట్లు వాయేజర్ డిజిటల్ వెల్లడించింది. మంగళవారం నాటి చాప్టర్ 11 దివాళా  పిటిషన్ దాఖలులో... న్యూజెర్సీ కేంద్రంగా ఉన్న వాయేజర్... లక్ష కంటే ఎక్కువ రుణదాతలు, $10 బిలియన్ల వరకు ఆస్తులను కలిగి ఉన్నట్లు అంచనా.  గత కొన్ని నెలలుగా క్రిప్టో మార్కెట్‌లలో దీర్ఘకాలిక అస్థిరత, కంపెనీ అనుబంధ సంస్థ వాయేజర్ డిజిటల్... LLC నుండి తీసుకున్న రుణానికి సంబంధించి ‘త్రీ యారోస్ క్యాపిటల్’  డిఫాల్ట్ అయిన నేపథ్యంలో... ఇప్పుడు ఉద్దేశపూర్వక, నిర్ణయాత్మక చర్య తీసుకోవాల్సిన అవసరముందని  వాయేజర్ CEO స్టీఫెన్ ఎర్లిచ్ ఒక ప్రకటనలో తెలిపారు.


 మొత్తం 15,250 బిట్‌కాయిన్లు(సుమారు $324 మిలియన్లు) సహా $350 మిలియన్ విలువైన USDC రుణాలకు సంబంధించి...  చెల్లింపులు చేయడంలో విఫలమైనందుకు సింగపూర్‌కు చెందిన క్రిప్టో హెడ్జ్ ఫండ్ త్రీ యారోస్ క్యాపిటల్(3AC)కు డిఫాల్ట్ నోటీసును జారీ చేసినట్లు వాయేజర్ కిందటి వారం  వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో... వాయేజర్ దివాళా పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం.   

Read more