రూ.82,000 కోట్ల సేకరణ!

ABN , First Publish Date - 2022-10-11T09:37:19+05:30 IST

అదానీ గ్రూప్‌ కనీసం 1,000 కోట్ల డాలర్ల (రూ.82,000 కోట్లు) నిదులు సమీకరించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది.

రూ.82,000 కోట్ల సేకరణ!

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌ కనీసం 1,000 కోట్ల డాలర్ల (రూ.82,000 కోట్లు) నిదులు సమీకరించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది. ఇందుకోసం సింగపూర్‌ ప్రభుత్వ ఇన్వెస్టర్‌ టెమాసెక్‌, ఆ దేశ ప్రభుత్వ వెల్త్‌ ఫండ్‌ జీఐసీతోపాటు పలు వెల్త్‌ఫండ్లు, ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ) ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. గ్రూప్‌నకు చెందిన సిమెంట్‌, పోర్టులు, హరిత ఇంధనం, ఎఫ్‌ఎంసీజీ వ్యాపారాలను భారీగా విస్తరించేందుకు నిధులను సేకరించాలనుకుంటోందని వారు వెల్లడించారు. గ్రూప్‌ సంస్థలు లేదా ప్రమోటింగ్‌ గ్రూప్‌ అనుబంధ కంపెనీల్లో ఈక్విటీ వాటాల విక్రయం ద్వారా పలు విడతల్లో ఈ నిధులను సమీకరించవచ్చని వారు పేర్కొన్నారు.

Updated Date - 2022-10-11T09:37:19+05:30 IST