‘సీఎంఆర్‌’కు బీఐఎస్‌ ప్రత్యేక గుర్తింపు

ABN , First Publish Date - 2022-03-16T08:16:36+05:30 IST

భారత నాణ్యతా ప్రమాణాల సంస్థ (బీఐఎస్‌) విశాఖ రీజియన్‌ నిర్వహించిన కొనుగోలు సాధికారిత వారోత్సవాల్లో ‘సీఎంఆర్‌’ షాపింగ్‌మాల్‌ ప్రత్యేక గుర్తింపును..

‘సీఎంఆర్‌’కు బీఐఎస్‌ ప్రత్యేక గుర్తింపు

విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): భారత నాణ్యతా ప్రమాణాల సంస్థ (బీఐఎస్‌) విశాఖ రీజియన్‌ నిర్వహించిన కొనుగోలు సాధికారిత వారోత్సవాల్లో ‘సీఎంఆర్‌’ షాపింగ్‌మాల్‌ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది. పాతికేళ్లుగా కొనుగోలుదారులకు బీఐఎస్‌ హాల్‌మార్క్‌ ఆభరణాలు అందిస్తున్నందుకుగాను సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌ అధినేత మావూరి వెంకటరమణను బీఐఎస్‌ విశాఖ రీజియన్‌ హెడ్‌ ఎంఏజే వినోద్‌ సత్కరించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మకమైన బీఐఎస్‌ జ్ఞాపిక అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ అవార్డు అందుకోవడానికి వినియోగదారులు తమ సంస్థపై చూపిస్తున్న నమ్మకం, అభిమానమే కారణమన్నారు. పాతికేళ్లుగా బీఐఎస్‌ హాల్‌మార్క్‌ కలిగిన ఆభరణాలను వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టుగా సరికొత్త డిజైన్లతో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు.

Read more