బిగ్‌ సీ దసరా, దీపావళి ఆఫర్లు

ABN , First Publish Date - 2022-09-29T09:28:28+05:30 IST

కొనుగోలుదారుల కోసం బిగ్‌ సీ దసరా, దీపావళి ఆఫర్లను ప్రకటించింది.

బిగ్‌ సీ దసరా, దీపావళి ఆఫర్లు

స్మార్ట్‌ ఫోన్లు, టీవీలపై డిస్కౌంట్లు.. క్యాష్‌ బ్యాక్‌ పొందే అవకాశం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కొనుగోలుదారుల కోసం బిగ్‌ సీ దసరా, దీపావళి ఆఫర్లను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లోని 250కి పైగా బిగ్‌ సీ రిటైల్‌ స్టోర్లలో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని బిగ్‌ సీ వ్యవస్థాపకుడు, సీఎండీ ఎం బాలు చౌదరి తెలిపా రు. డబుల్‌ ధమాకా ఆపర్లతో పాటు ఎంటీఎం కార్డుపై ఎటువంటి డౌన్‌ పేమెంట్‌ లేకుండా మొబైల్‌, ల్యాప్‌టాప్‌ లు, స్మార్ట్‌ టీవీలు కొనుగోలు చేసే సదుపాయం ఉందన్నారు. ప్రతి స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలుపై తక్కువ ధరకు ఇయర్‌బడ్స్‌, స్మార్ట్‌ వాచ్‌లు అందిస్తున్నట్లు వివరించారు. దీంతోపాటు  ప్రతి స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలుపై రూ.3,000 వరకూ ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ కూడా బిగ్‌ సీ ఆఫర్‌ చేస్తోందని బాలు చౌదరి చెప్పారు. ప్రతి స్మార్ట్‌ టీవీ కొనుగోలుపై రూ.4,999కే రూ.11,499 ఫింగర్స్‌ బార్‌ స్పీకర్‌ ఊఫర్స్‌ అందిస్తోంది. ఈ ఆఫర్ల కింద బ్రాండెడ్‌ యాక్ససరీలపై 51 శాతం వరకూ డిస్కౌంట్‌. ఐఫోన్‌ మొబైల్స్‌ కొనుగోలుపై రూ.5,000 వరకూ, శామ్‌సంగ్‌ ఫోన్లపై రూ.10,000 వరకూ క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లున్నట్లు బిగ్‌ సీ తెలిపింది. 

Read more