సెప్టెంబరులో ఐడీబీఐ బ్యాంక్‌ కోసం బిడ్లు !

ABN , First Publish Date - 2022-08-31T09:43:00+05:30 IST

ఐడీబీఐ బ్యాంక్‌ ప్రైవేటీకరణ ప్రక్రియ ఊపందుకుంది. వచ్చే నెల ఇందుకోసం ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లు (ఈఓఐ) ఆహ్వానించే అవకాశం ఉన్నట్టు..

సెప్టెంబరులో ఐడీబీఐ బ్యాంక్‌ కోసం బిడ్లు !

న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌ ప్రైవేటీకరణ ప్రక్రియ ఊపందుకుంది. వచ్చే నెల ఇందుకోసం ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లు (ఈఓఐ) ఆహ్వానించే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు చెప్పాయి. ఐడీబీఐ బ్యాంక్‌ ఈక్విటీలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి 45.48 శాతం, ఎల్‌ఐసీకి 49.24 శాతం వాటా ఉంది. నిర్వహణ స్వేచ్ఛ పేరుతో బ్యాంక్‌లో 26 శాతం వాటా ప్రైవేట్‌ సంస్థలకు అమ్మాలని ప్రభుత్వం భావిస్తోంది.  

Read more