భారత్ పే నుంచి అష్నీర్ గ్రోవర్ భార్య మాధురీ జైన్‌ తొలగింపు...

ABN , First Publish Date - 2022-02-23T23:33:34+05:30 IST

కంపెనీ నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపధ్యంలో... అధికారిణి మాధురీ జైన్‌‌ను భారత్ పే తొలగించింది.

భారత్ పే నుంచి అష్నీర్ గ్రోవర్ భార్య మాధురీ జైన్‌ తొలగింపు...

హైదరాబాద్ : కంపెనీ నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపధ్యంలో... అధికారిణి మాధురీ జైన్‌‌ను భారత్ పే తొలగించింది. వ్యక్తిగత సౌందర్య చికిత్సలు, ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలు, యూఎస్, దుబాయ్‌లకు కుటుంబ పర్యటనల కోసం కంపెనీ నిధులను ఉపయోగించినట్లు ఆమపై ఆరోపణలు తలెత్తిన విషయం తెలిసిందే. మాధురికి ఉన్న స్టాక్ ఆప్షన్‌లను కూడా రద్దు చేశారు. సంబంధిత వర్గాల సమాచారం మేరకు మరిన్ని వివరాలిలా ఉన్నాయి. 


భారత్‌పే ఆర్థిక అవకతవకలకు పాల్పడినందుకు ఫిన్‌టెక్ సంస్థ సహ వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ అష్నీర్ గ్రోవర్ భార్య మాధురీ జైన్ గ్రోవర్‌ను తొలగింపునకు గురయ్యారు. ఆమె వద్ద ఉన్న ఈఎస్‌ఓపీలను రద్దు చేశారు. అంతేకాకుండా, ఆమె తన వ్యక్తిగత సిబ్బందికి కంపెనీ ఖాతాల నుండి డబ్బు చెల్లించిందని, ఆయా  పార్టీల నుండి నకిలీ ఇన్‌వాయిస్‌లను తయారు చేసిందన్న ఆరోపణలను కూడా ఆమె ఎదుర్కొంటున్నారు.  తెలిపారు.

Read more