ఆ విషయంలో అత్యుత్తమ పోటీ నగరంగా Bangalore

ABN , First Publish Date - 2022-05-24T22:03:39+05:30 IST

ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరులో ఉద్యోగాలకు కొదవలేదు. సరికొత్త ఐడియాలు అక్కడ పురుడు

ఆ విషయంలో అత్యుత్తమ పోటీ నగరంగా Bangalore

బెంగళూరు: ఇండియన్  సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరులో ఉద్యోగాలకు కొదవలేదు. సరికొత్త ఐడియాలు అక్కడ పురుడుపోసుకుంటూ ఉంటాయి. రోజుకో స్టార్టప్ కంపెనీ ఇక్కడ కార్యాలయం తెరుస్తూ ఉంటుంది. అలాంటి ఈ నగరం మరో ఘనత సాధించింది. సీనియర్ హ్యూమన్ రిసోర్సెస్ (హెచ్ఆర్), జూనియర్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్, సీనియర్ డెవలపర్స్, సీనియర్ డేటా సైంటిస్ట్‌లు, సీనియర్ వీడియో గేమ్ డెవలర్లు వంటి నిపుణుల కోసం అత్యుత్తమ పోటీ నగరంగా బెంగళూరు అవతరించినట్టు తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. గ్లోబల్ టాలెంట్ ఆపరేటింగ్ సిస్టం కంపెనీ ‘వర్క్ మోషన్’ (WorkMotion) నిర్వహించిన ‘ద లోకల్ టాలెంట్ ఇండెక్స్’ అధ్యయనంలో ఈ విషయం వెలుగు చూసింది.


జూనియర్ హెచ్ఆర్, జూనియర్/సీనియర్ డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్స్, సీనియర్ సైబర్ సెక్యూరిటీ నిపుణులు, జూనియర్ వీడియో గేమ్ డెవలపర్లు వంటి నిపుణుల కోసం గ్లోబల్ రిమోట్ ఎంప్లాయిమెంట్ మార్కెట్‌లో పోటీ పడగల ఐదు నగరాల్లో బెంగళూరు ఒకటిగా నిలిచింది. నేడు, రేపటి ఉద్యోగాల కోసం పోటీ పడేందుకు ఏయే నగరాలు ఉత్తమమైనవో తెలుసుకోవడమే లక్ష్యంగా ఈ అధ్యయనం నిర్వహించింది. 


జూనియర్, సీనియర్ కేటగిరీలలో నైపుణ్యం, సగటు వేతనం, ఆంగ్లంలో ప్రావీణ్యం, కో-వర్కింగ్ స్పేస్ వంటివాటిని ప్రామాణికంగా తీసుకుని ఈ అధ్యయనం నిర్వహించారు. వర్క్‌మోషన్ కో-ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ కార్‌స్టెన్ లెబ్‌టిగ్ మాట్లాడుతూ.. 2005 తర్వాత ఇంటి నుంచి పనిచేస్తున్న వారి సంఖ్య 140 శాతం పెరిగినట్టు చెప్పారు. రిమోట్ వర్కింగ్ అనేది ఇప్పుడు సరికొత్త సాధారణ అంశంగా మారిపోయిందని ఆయన వివరించారు.

Updated Date - 2022-05-24T22:03:39+05:30 IST