దుమ్మురేపిన Bajaj Finance షేర్లు.. 7.4% పెరిగాయ్..

ABN , First Publish Date - 2022-07-28T16:05:17+05:30 IST

జాజ్ ఫైనాన్స్ షేర్లు దుమ్మురేపాయి. గురువారం నాటి ఇంట్రా-డే(Intra-day)లో బజాజ్ ఫైనాన్స్ షేరు

దుమ్మురేపిన Bajaj Finance షేర్లు.. 7.4% పెరిగాయ్..

Bajaj Finance : బజాజ్ ఫైనాన్స్ షేర్లు దుమ్మురేపాయి. గురువారం నాటి ఇంట్రా-డే(Intra-day)లో బజాజ్ ఫైనాన్స్ షేరు 7.4 శాతం లాభపడి రూ. 6,868కి చేరుకుంది. రెండు రోజుల్లో కంపెనీ ఏకీకృత నికర లాభంలో 159 శాతం వృద్ధిని నమోదు చేసింది. రెండు రోజుల్లో 10 శాతం పెరిగింది. 2022 ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.2,596 కోట్లకు చేరుకుంది.


బలమైన లాభం వృద్ధికి బలమైన నికర వడ్డీ ఆదాయం(NII) వృద్ధి, తక్కువ రుణ నష్టాలు, కేటాయింపులు సహాయం అందించాయి. ఈ త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ. 6,743 కోట్ల నుంచి జూన్ త్రైమాసికంలో 38 శాతం పెరిగి రూ. 9,283 కోట్లకు చేరుకుందని బజాజ్ ఫైనాన్స్ బుధవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌(Regulatory Filing)లో తెలిపింది. కస్టమర్ల బేస్(Customer Base) జూన్ 30, 2022 నాటికి 6.03 కోట్లుగా ఉంది.


క్రితం ఏడాదితో పోలిస్తే కస్టమర్ బేస్ విషయంలో 20 శాతం వృద్ధిని సాధించింది. ఈ ఒక్క త్రైమాసికంలోనే 27.3 లక్షల కస్టమర్లు పెరిగారు. గత ఏడాది జూన్ త్రైమాసికంలో వడ్డీ ఆదాయం రూ. 5,954 కోట్లతో పోలిస్తే ఈ జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో 33 శాతం పెరిగి రూ. 7,920 కోట్లకు చేరుకుంది. నిర్వహణలో ఉన్న ఆస్తులు 30 శాతం పెరిగి రూ. 2,04,018 కోట్లకు చేరుకున్నాయి.


Updated Date - 2022-07-28T16:05:17+05:30 IST