బజాజ్‌ ఎలకా్ట్రనిక్స్‌ ఐపీఓ అదుర్స్‌

ABN , First Publish Date - 2022-10-08T09:18:25+05:30 IST

ఎలకా్ట్రనిక్స్‌ మార్ట్‌ ఇండియా (ఈఎంఐఎల్‌) ఐపీఓ సూపర్‌ డూపర్‌ హిట్టయింది. తుది రోజైన శుక్రవారానికి 71.93 రెట్లు ఓవర్‌ సబ్‌స్ర్కైబ్‌ అయింది.

బజాజ్‌ ఎలకా్ట్రనిక్స్‌ ఐపీఓ అదుర్స్‌

72 రెట్లు సబ్‌స్ర్కిప్షన్‌

హైదరాబాద్‌: ఎలకా్ట్రనిక్స్‌ మార్ట్‌ ఇండియా (ఈఎంఐఎల్‌) ఐపీఓ సూపర్‌ డూపర్‌ హిట్టయింది. తుది రోజైన శుక్రవారానికి 71.93 రెట్లు ఓవర్‌ సబ్‌స్ర్కైబ్‌ అయింది. మొత్తం 6.25 కోట్ల షేర్లను కంపెనీ ఈ ఐపీఓ ద్వారా జారీ చేయగా ఇన్వెస్టర్ల నుంచి 449.53 కోట్ల షేర్లకు బిడ్స్‌ వచ్చాయి. శుక్రవారం ఇష్యూ ముగిసే సరికి క్యూఐబీ ఇష్యూ 169.54 రెట్లు, నాన్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల (ఎన్‌ఐఐఎస్‌) విభాగం 63.59 రెట్లు, రిటైల్‌ ఇన్వెస్టర్ల విభాగం 19.71 రెట్లు ఓవర్‌ సబ్‌స్ర్కైబ్‌ అయ్యాయి. బజాజ్‌ ఎలకా్ట్రనిక్స్‌ పేరుతో ఎలక్ట్రిక్‌, ఎలకా్ట్రనిక్‌ వినియోగ వస్తువులను ఈంఐఎల్‌ మార్కెట్‌ చేస్తోంది. రూ.500 కోట్ల సమీకరణ కోసం ఒక్కో షేరు రూ.53-59 ధరల శ్రేణిలో ఐపీఓ ద్వారా జారీ చేసింది.

Read more