అగస్టా వెస్ట్‌ల్యాండ్ స్కాం... * మాజీ రక్షణ కార్యదర్శిపై అనుబంధ చార్జిషీట్

ABN , First Publish Date - 2022-03-17T01:05:35+05:30 IST

అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రూ. 3,700 కోట్ల అగస్టా వెస్ట్‌ల్యాండ్ కుంభకోణం కేసులో...రక్షణ శాఖ మాజీ కార్యదర్శి శశికాంత్ శర్మ సహా మరో ముగ్గుు ఐఏఎఫ్ సిబ్బందిపై సీబీఐ... బుధవారం అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసింది.

అగస్టా వెస్ట్‌ల్యాండ్ స్కాం...   * మాజీ రక్షణ కార్యదర్శిపై అనుబంధ చార్జిషీట్

న్యూఢిల్లీ : అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రూ. 3,700 కోట్ల అగస్టా వెస్ట్‌ల్యాండ్ కుంభకోణం కేసులో...రక్షణ శాఖ మాజీ కార్యదర్శి శశికాంత్ శర్మ సహా మరో ముగ్గుు ఐఏఎఫ్  సిబ్బందిపై సీబీఐ... బుధవారం అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసింది. కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌గా 2011-2013 మధ్యకాలంలో రక్షణ శాఖ కార్యదర్శిగా పనిచేసిన శర్మను ప్రాసిక్యూట్‌ చేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంతో సీబీఐ ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేసింది. అప్పటి ఎయిర్ వైస్ మార్షల్ జస్బీర్ సింగ్ పనేసర్(తర్వాతి కాలంలో  పదవీ విరమణ చేశారు), డిప్యూటీ చీఫ్ టెస్ట్ పైలట్ ఎస్ ఏ కుంటే, అప్పటి వింగ్ కమాండర్ థామస్ మాథ్యూ, గ్రూప్ కెప్టెన్ ఎన్ సంతోష్ పేర్లను కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ పేర్కొంది. కుంటే, సంతోష్ ఎయిర్ కమోడోర్‌గా పదవీవిరమణ చేశారు.


అగస్టావెస్ట్‌ల్యాండ్‌కు అనుకూలంగా 12 వీవీఐపీ హెలికాప్టర్‌లను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకోవడానికి లంచం తీసుకున్నట్లు ఆరోపణలున్న కేసు. ఆ హెలికాప్టర్‌లు భారత వైమానిక దళం నిర్దేశించిన 6 వేల మీటర్ల ఆపరేషనల్ సీలింగ్ పారామీటర్‌ను అందుకోనందున అనర్హమైనవిగా నిర్ధారించారు. హెలికాప్టర్ల ఆపరేషనల్ సీలింగ్‌ను 6 వేల మీటర్ల నుంచి 4,500 మీటర్లకు తగ్గించాలని నాటి ఐఏఎఫ్ చీఫ్ ఎస్‌పీ త్యాగి సిఫార్సు చేశారని, తద్వారా అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ను రేసులోకి తెచ్చిందని సీబీఐ ఆరోపించింది. ఐఏఎఫ్... ఈ సిఫారసులను తీవ్రంగా వ్యతిరేకించింది. అయినప్పటికీ... త్యాగి చీఫ్ అయినప్పుడు, అతను దానిని సిఫార్సు చేసినట్లు సీబీఐ ఆరోపించింది. 


త్యాగి, అతని బంధువులు రాజీవ్, సందీప్‌లకు లంచం ఇచ్చిన క్రిస్టియన్ మిచెల్, గైడో హాష్కే సహా కార్లోస్ గెరోసా అనే ముగ్గురు మధ్యవర్తుల సేవలనందించిన ఫిన్‌మెకానికా, అగస్టావెస్ట్‌ల్యాండ్ టాప్ ఎగ్జిక్యూటివ్‌ల సూచన మేరకు ఈ కుంభకోణం జరిగిందని సీబీఐ పేర్కొంది. రూ. 3,600 కోట్ల ఒప్పందాన్ని తమకనుకూలంగా మార్చుకోవడానికి కంపెనీల నుంచి దాదాపు 42.27 మిలియన్ యూరోలు, డీల్ మొత్తంలో దాదాపు ఏడు శాతం మేర మిచెల్ సంస్థలు అందుకున్నాయని సీబీఐ ఆరోపించింది.  లంచాలు మిచెల్, గౌతమ్ ఖైతాన్ అనే న్యాయవాది కంపెనీలు, లేయర్డ్ లావాదేవీల ద్వారా బహుళ ఒప్పందాల రూపంలో పంపిణీ జరిగినట్లు సీబీఐ నివేదించింది. ఈ కేసులో 2017 సెప్టెంబరులో మాజీ ఐఏఎఫ్ చీఫ్ త్యాగి తదితరుల పేర్లతో తొలి ఛార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మిచెల్ సహా మరికొందరిపై... 2020  సెప్టెంబరులో మరో ఛార్జిషీట్ దాఖలైంది. 

Updated Date - 2022-03-17T01:05:35+05:30 IST