త్వరలోనే IPod Touch కనుమరుగు.. Apple ప్రకటన

ABN , First Publish Date - 2022-05-12T21:36:41+05:30 IST

కాలిఫోర్నియా : పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్లలో చివరిగా మిగిలిన IPod Touch (ఐప్యాడ్ టచ్‌) త్వరలోనే కనుమరుగవనుందని టెక్నాలజీ దిగ్గజం APPLE ప్రకటించింది.

త్వరలోనే  IPod Touch కనుమరుగు.. Apple ప్రకటన

కాలిఫోర్నియా : పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్లలో చివరిగా మిగిలిన IPod Touch (ఐప్యాడ్ టచ్‌) త్వరలోనే కనుమరుగవనుందని టెక్నాలజీ దిగ్గజం APPLE ప్రకటించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సప్లయ్ మాత్రమే చివరిదని, ఆ తర్వాత అందుబాటులోకి తీసుకురాబోమని కంపెనీ స్పష్టం చేసింది. సప్లయ్‌ని ఉపసంహరించుకుంటునప్పటికీ ఐఫోన్, ఐప్యాడ్, హోంప్యాడ్ మినీ వంటి అన్ని మ్యూజిక్ ప్లేయర్లలో ఐప్యాడ్ టచ్‌ ప్రేరణ కొనసాగుతుందని వివరించింది. కాగా తొలి ఐప్యాడ్ టచ్‌ను ప్రవేశపెట్టిన 20 ఏళ్ల తర్వాత ఇది  కాలగర్భంలో కలిసిపోతున్నట్టవుతోంది. దాదాపు 2 దశాబ్దాల క్రితం ఓ ప్రెస్‌మీట్‌లో ప్రవేశపెట్టిన ఒరిజినల్ ఫైర్‌వైర్ సామర్థ్యమున్న మోడల్ కేవలం పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్‌గా మాత్రమే పనిచేసింది. ఆ తర్వాత యాపిల్ అనేక మోడల్స్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. 2017 వరకు కేవలం మ్యూజిక్ వినేందుకు మాత్రమే మోడళ్లను మార్కెట్లో ప్రవేశపెట్టింది. అదే ఏడాది ఐప్యాడ్ నానో, షఫుల్‌ ఉత్పత్తులను నిలపివేసింది. కాగా ఐప్యాడ్ టచ్‌కు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది. చేతిలో ఐఫోన్ లేకపోయినా అంతటి అనుభూతి ఉంటుందని ఔత్సాహికులు చెబుతున్నారు.

Read more