‘ఆపిల్’... మరో 5.6 మిలియన్ డాలర్ల జరిమానా

ABN , First Publish Date - 2022-02-16T23:42:37+05:30 IST

ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ, అంతర్జాతీయ స్థాయి దిగ్గజ కంపెనీ ఆపిల్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. డచ్ కాంపిటీషన్ రెగ్యులేటర్... మరో $ 5.6 మిలియన్ జరిమానా విధించింది

‘ఆపిల్’... మరో 5.6 మిలియన్ డాలర్ల జరిమానా

న్యూయార్క్ : ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ, అంతర్జాతీయ స్థాయి దిగ్గజ కంపెనీ ఆపిల్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. డచ్ కాంపిటీషన్ రెగ్యులేటర్... మరో $ 5.6 మిలియన్ జరిమానా విధించింది. డేటింగ్ యాప్ ప్రొవైడర్లపై ఆపిల్ విధించిన సవరించిన షరతులు అసమంజసమైనవని,  అనవసరమైన అడ్డంులను సృష్టిస్తున్నాయని అథారిటీ ఫర్ కన్స్యూమర్స్ అండ్ మార్కెట్స్(ఏసీఎం) పేర్కొంది. ‘డేటింగ్-యాప్ ప్రొవైడర్లు ప్రత్యామ్నాయ చెల్లింపు వ్యవస్థను ఉపయోగించుకోదలచుకున్నపక్షంలో...  పూర్తిగా కొత్త యాప్‌ను తప్పనిసరిగా అభివృద్ధి చేయాలని కొత్త షరతులు నిర్దేశిస్తున్నాయి’ అని కాంపిటీషన్ వాచ్‌డాగ్ ఓ ప్రకటనలో పేర్కొంది. 



‘ఈ క్రమంలో... యాపిల్ మరో ఐదె మిలియన్ యూరోల($ 5.6 మిలియన్లు)ను చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం పెనాల్టీ చెల్లింపులు ప్రస్తుతం 20 మిలియన్ యూరోలు($22.6 మిలియన్లు)గా ఉన్నాయి’ అని వెల్లడించింది. ఇది... ఐఫోన్ తయారీదారుపై నాలుగో వారపు జరిమానానే కాకుండా, ఆపిల్ తన ఆర్డర్‌ను పాటించడంలో విఫలమైనపక్షంలో... ఈ జరిమానాలు వారానికోసారి కొనసాగనున్నట్లు ఆపిల్ సంస్థ చెబుతుండడం గమనార్హం. కాంపిటీషన్ రెగ్యులేటర్ చెబుతున్న దాని ప్రకారం... సవరించిన షరతుల్లో... ప్రత్యామ్నాయ చెల్లింపు పద్ధతిని ఉపయోగించాలనుకునే డేటింగ్-యాప్ ప్రొవైడర్లపై ఆపిల్ గణనీయమైన సంఖ్యలో షరతులను విధిస్తోంది. డేటింగ్-యాప్ ప్రొవైడర్లు తప్పనిసరిగా కొత్త యాప్‌ను అభివృద్ధి చేసి, దానిని ఆపిల్ యాప్ స్టోర్‌కు సమర్పించాల్సి ఉంటుందన్నది ఇందుకు ఓ ఉదాహరణ.


కాగా... ఈ పరిణామం... డేటింగ్-యాప్ ప్రొవైడర్లను తీవ్రంగా ఇబ్బందులపాలు చేస్తుందని ఏసీఎం అభిప్రాయపడింది. అంటే... ప్రత్యామ్నాయ చెల్లింపు వ్యవస్థను ఎంచుకునే డేటింగ్-యాప్ ప్రొవైడర్లు అదనపు ఖర్చులను భరించాల్సి ఉంటుంది. అంతేకాకుండా... ప్రస్తుతం యాప్‌ను ఉపయోగించే వినియోగదారులు కొత్త యాప్‌కు మారాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయ చెల్లింపు పద్ధతిని ఉపయోగించగలుగుతారు’ అని వివరించింది. డేటింగ్-యాప్ ప్రొవైడర్ల కోసం డచ్ యాప్ స్టోర్‌కు యాక్సెస్ కోసం ఆపిల్ తప్పనిసరిగా దాని షరతులను సర్దుబాటు చేయాల్సి ఉంటుందని వినవస్తోంది. 

Updated Date - 2022-02-16T23:42:37+05:30 IST