నెలాఖరుకు ఆకాశ ఎయిర్‌ టేకాఫ్‌

ABN , First Publish Date - 2022-07-05T08:10:42+05:30 IST

త్వరలో టేకా్‌ఫకు సిద్ధం అవుతున్న ఆకాశ ఎయిర్‌ అందుకు సన్నాహకంగా సిబ్బంది యూనిఫారంను ఆవిష్కరించింది.

నెలాఖరుకు ఆకాశ ఎయిర్‌ టేకాఫ్‌

సిబ్బంది యూనిఫారం ఆవిష్కారం

ముంబై: త్వరలో టేకా్‌ఫకు సిద్ధం అవుతున్న ఆకాశ ఎయిర్‌ అందుకు సన్నాహకంగా సిబ్బంది యూనిఫారంను ఆవిష్కరించింది. స్టాక్‌ మార్కె ట్‌ గురు రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా నేతృత్వంలోని ఆకాశ ఎయిర్‌ ఈ నెలాఖరుకు విమాన సర్వీసులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.  గత నెల 21న సంస్థ తొలి బోయింగ్‌ 737 మాక్స్‌   విమానాన్ని అందుకుంది. కాగా ఎప్పుడూ బిజీగా ఉండే విమాన సేవల్లో సిబ్బందికి సౌకర్యవంతంగా ఉండే విధంగా యూనిఫారం డిజైన్‌ చేసినట్టు కంపెనీ ప్రకటించింది. ఆకాశ ఎయిర్‌ కోసం మాత్రమే ప్రత్యేకంగా తయారుచేయించిన వస్త్రంతో (సముద్ర వ్యర్థాల నుంచి సేకరించిన పెట్‌ బాటిల్స్‌ రీసైకిల్‌ చేయించి తయారుచేసిన వస్త్రం) సిబ్బందికి ట్రౌజర్లు, జాకెట్లు తయారుచేయించామని తెలిపింది. అలాగే ఎక్కువ సేపు నిలబడినా ఎలాంటి ఇబ్బంది లేని విధంగా అరికాలికి చక్కని కుషనింగ్‌ ఉండేలా వారి కోసం ప్రత్యేకంగా బూట్లు తయారు చేయించినట్టు తెలిపింది. 

Read more