రష్యాలో మళ్ళీ... ఆ ఫోన్ల విక్రయం

ABN , First Publish Date - 2022-05-25T00:10:24+05:30 IST

ద్రవ్యోల్బణం, పాశ్చాత్య బ్రాండ్‌ల ఎగుమతులను నిలిపివేస్తుండడం తదితర పరిణామాల నేపథ్యంలో రష్యాలోని అతిపెద్ద మొబైల్ ఆపరేటర్ MTS... డిస్కౌంట్, ఉపయోగించిన స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించడం ప్రారంభించింది.

రష్యాలో మళ్ళీ... ఆ ఫోన్ల విక్రయం

మాస్కో : ద్రవ్యోల్బణం, పాశ్చాత్య బ్రాండ్‌ల ఎగుమతులను నిలిపివేస్తుండడం తదితర పరిణామాల నేపథ్యంలో రష్యాలోని అతిపెద్ద మొబైల్ ఆపరేటర్ MTS... డిస్కౌంట్, ఉపయోగించిన స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించడం ప్రారంభించింది. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాలో యాపిల్ అన్ని ఉత్పత్తుల విక్రయాలను పాజ్ చేసిన విషయం తెలిసిందే. కాగా... రష్యాలో మార్చి మొదటి రెండు వారాల్లో చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌ల విక్రయాలు దాదాపుగా రెట్టింపయ్యాయి. కాగా ‘ఇది మా కంపెనీకి మంచి అవకాశం’ అని ఎంటీఎస్ అధికారి ఒకరు పేర్కొన్నారు. 

Read more