అత్యంత పలుకుబడి వ్యక్తుల్లో అదానీ

ABN , First Publish Date - 2022-05-24T09:36:55+05:30 IST

భారత కుబేరుడు, అదానీ గ్రూప్‌ అధిపతి గౌతమ్‌ అదానీ.. ప్రపంచంలో అత్యంత పలుకుబడి కలిగిన వ్యక్తుల్లో ఒకరిగా నిలిచారు.

అత్యంత పలుకుబడి వ్యక్తుల్లో అదానీ

వంద మందితో జాబితా విడుదల చేసిన టైమ్‌ మ్యాగజైన్‌ 

న్యూయార్క్‌: భారత కుబేరుడు, అదానీ గ్రూప్‌ అధిపతి గౌతమ్‌ అదానీ.. ప్రపంచంలో అత్యంత పలుకుబడి కలిగిన వ్యక్తుల్లో ఒకరిగా నిలిచారు. ప్రముఖ టైమ్‌ మ్యాగజైన్‌ ఈ ఏడాదికి గాను ‘100 మంది అత్యంత పలుకుబడి వ్యక్తుల’ జాబితాను సోమవారం విడుదల చేసింది. ఈ లిస్టులో అదానీతో పాటు ప్రముఖ న్యాయవాది కరుణ నందికి సైతం చోటు దక్కింది.


అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, రష్యా ప్రెసిడెంట్‌ వ్లాదిమిర్‌ పుతిన్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, యూరోపియన్‌ కమిషన్‌  ప్రెసిడెంట్‌ ఉర్సుల వాన్‌ డెర్‌ లేయెన్‌, ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారుడు రాఫెల్‌ నాడల్‌, యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌, మీడియా మొగల్‌ ఓప్రా విన్‌ఫ్రే వంటి ప్రముఖలు ఈ జాబితాలో ఉన్నారు. ఒకప్పుడు ప్రాంతీయ వ్యాపార సంస్థగా ఉన్న అదానీ.. ఎయిర్‌పోర్టులు, నౌకాశ్రయాలు, సోలార్‌, థర్మల్‌ పవర్‌, వినియోగదారుల వస్తువుల రంగాల్లో విస్తరించడం ద్వారా భారత్‌లోని దిగ్గజ గ్రూప్‌ల్లో ఒకటిగా ఎదిగిందని టైమ్‌ మ్యాగజైన్‌ పేర్కొంది. 

Read more