ఏసీసీ, అంబుజా ఓపెన్‌ ఆఫర్‌ తుస్‌

ABN , First Publish Date - 2022-09-10T06:24:03+05:30 IST

ఏసీసీ, అంబుజా సిమెంట్స్‌ కంపెనీల ఈక్విటీలో మరో 26 శాతం వాటా కొనుగోలు కోసం అదానీ గ్రూప్‌ ప్రకటించిన రూ.31,000 కోట్ల

ఏసీసీ, అంబుజా ఓపెన్‌ ఆఫర్‌ తుస్‌

న్యూఢిల్లీ: ఏసీసీ, అంబుజా సిమెంట్స్‌ కంపెనీల ఈక్విటీలో మరో 26 శాతం వాటా కొనుగోలు కోసం అదానీ గ్రూప్‌ ప్రకటించిన రూ.31,000 కోట్ల ఓపెన్‌ ఆఫర్‌ శుక్రవారం ముగిసింది. ఈ ఓపెన్‌ ఆఫర్‌కు మదుపరుల నుంచి పెద్దగా స్పందన లభించలేదు. ఏసీసీ ఈక్విటీలో 4.89 కోట్ల షేర్లను ఒక్కో షేరు రూ.2,300 చొప్పున కొనేందుకు, అంబుజా సిమెంట్‌ ఈక్విటీలో 51.63 కోట్ల షేర్లను ఒక్కో షేరు రూ.385 చొప్పున కొనేందుకు అదానీ గ్రూప్‌ గత నెల 26న ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించింది. అయితే శుక్రవారం మధ్యాహ్నానికి ఏసీసీ ఈక్విటీలో 40.51 లక్షల షేర్లు (8.28 శాతం), అంబుజా సిమెంట్‌ కంపెనీ ఈక్విటీలో 6.97 లక్షల షేర్లు (1.35 శాతం) అమ్మేందుకు మాత్రమే మదుపరులు ముందుకొచ్చారు. శుక్రవారం బీఎ్‌సఈలో ఏసీసీ షేరు 2.28 శాతం క్షీణించి రూ.2,365 వద్ద క్లోజవగా, అంబుజా సిమెంట్స్‌ షేరు 1.7 శాతం నష్టపోయి రూ.453.90 వద్ద ముగిసింది. ఈ ఏడాది మే నెలలో అదానీ గ్రూప్‌ స్విట్జర్లాండ్‌కు చెందిన హోల్సిమ్‌ కంపెనీ నుంచి ఈ రెండు కంపెనీల్లో మెజారిటీ వాటాను సుమారు రూ.83,920 కోట్లకు కొనుగోలు చేసింది. సెబీ నిబంధనల ప్రకారం ఈ రెండు కంపెనీల ఈక్విటీలో మరో 26ు వాటా కొనుగోలుకు ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించింది.

Read more