ఒక చార్జింగ్‌తో 677 కి.మీ ప్రయాణం

ABN , First Publish Date - 2022-10-04T09:06:00+05:30 IST

జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెజ్‌ బెంజ్‌.. మేడ్‌ ఇన్‌ ఇండియా ఎలక్ట్రిక్‌ కారు ‘ఈక్యూఎస్‌ 580-4మ్యాటిక్‌’ మోడల్‌ను దేశీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

ఒక చార్జింగ్‌తో 677 కి.మీ ప్రయాణం

మార్కెట్లోకి రూ.1.55 కోట్ల ఎలక్ట్రిక్‌ బెంజ్‌ కారు 

పుణె: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెజ్‌ బెంజ్‌.. మేడ్‌ ఇన్‌ ఇండియా ఎలక్ట్రిక్‌ కారు ‘ఈక్యూఎస్‌ 580-4మ్యాటిక్‌’ మోడల్‌ను దేశీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. మెర్సిడెజ్‌ బెంజ్‌ దేశీయంగా తయారు చేసిన తొలి ఎలక్ట్రిక్‌ వాహనం ఇదే. అంతే కాదు, జర్మనీ వెలుపల ఈ కారును భారత్‌లోనే తయారుచేశారు. దీని ధర రూ.1.55 కోట్లు. పూర్తి చార్జింగ్‌తో ఈ కారు కనీసం 677 కిలోమీటర్లు ప్రయాణించగలదని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్‌ కార్లలో పూర్తి చార్జింగ్‌తో ఇంతదూరం ప్రయాణించగలిగే ఏకైక కారు ఇదేనని సంస్థ పేర్కొంది. 

Updated Date - 2022-10-04T09:06:00+05:30 IST