జూన్‌ ఎగుమతుల్లో 17% వృద్ధి

ABN , First Publish Date - 2022-07-05T08:07:34+05:30 IST

ఎగుమతుల రంగం జూన్‌ నెలలో 16.78 శాతం వృద్ధిని నమోదు చేసింది. మొత్తం ఎగుమతుల విలువ 3,794 కోట్ల డాలర్లు (రూ.2,95,932 కోట్లు)గా ఉండగా వాణిజ్య లోటు 2,563 కోట్ల డాలర్ల (రూ.1,99,914 కోట్లు)కు దూసుకుపోయింది.

జూన్‌ ఎగుమతుల్లో 17% వృద్ధి

న్యూఢిల్లీ : ఎగుమతుల రంగం జూన్‌ నెలలో 16.78 శాతం వృద్ధిని నమోదు చేసింది. మొత్తం ఎగుమతుల విలువ 3,794 కోట్ల డాలర్లు (రూ.2,95,932 కోట్లు)గా ఉండగా వాణిజ్య లోటు 2,563 కోట్ల డాలర్ల (రూ.1,99,914 కోట్లు)కు దూసుకుపోయింది. బంగారం, క్రూడాయిల్‌ దిగుమతులు పెరగడమే వాణిజ్య లోటు పెరిగిపోవడానికి కారణమని ప్రభుత్వ ప్రాథమిక గణాంకాలు తెలుపు తున్నాయి. మరోవైపు దిగుమతులు 51 శాతం పెరిగి 6,358 కోట్ల డాలర్ల (రూ.4,95,924 కోట్లు)కు చేరాయి. జూన్‌ నెలలో ఇంజనీరింగ్‌, ఫార్మా, ప్లాస్టిక్‌ ఉత్పత్తుల ఎగుమతులు ప్రతికూల వృద్ధిని నమోదు చేయడం వల్ల మే నెలతో పోల్చితే ఎగుమతుల వృద్ధి రేటు 20.55 శాతం నుంచి తగ్గింది. ఇదిలా ఉండగా ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో ఎగుమతులు 22.22 శాతం పెరిగి 11,677 కోట్ల డాలర్లకు చేరాయి. దిగుమతులు 47.31 శాతం పెరిగి 18,702 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. మూడు నెలల మొత్తం వాణిజ్య లోటు 7025 కోట్ల డాలర్లకు దూసుకుపోయింది. గత ఏడాది జూన్‌లో వాణిజ్య లోటు 3,142 కోట్ల డాలర్లుంది. జూన్‌లో క్రూడాయిల్‌ దిగుమతులు 94 శాతం పెరిగి 2,073 కోట్ల డాలర్లకు చేరాయి. బంగారం దిగుమతులు ఏకంగా 169.5 శాతం పెరిగి 261 కోట్ల డాలర్లకు చేరాయి. 


విత్తలోటు లక్ష్యం సాధిస్తాం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత విత్తలోటు లక్ష్యం 6.4ు సాధించగలమన్న విశ్వాసం అధికార వర్గాలు తెలి పాయి. అందుకు దీటుగా ఆర్థిక క్రమశిక్షణకు కట్టుబడనున్నట్టు హామీ ఇచ్చా యి. భారత ఆర్థిక వ్యవస్థ పునాదులు పటిష్ఠంగా ఉన్నాయని, ప్రపంచం నుంచి ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నదని చెప్పారు. అంత ర్జాతీయ విపణిలో క్రూడాయిల్‌ ధరల పెరుగుదలను దీటుగా ఎదుర్కొనేం దుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. క్రూడ్‌ ధరలు అధికంగా ఉన్న ప్రభావంతో కరెంట్‌ ఖాతా లోటు కూడా అధికంగా ఉండవచ్చన్నారు.

Read more