2025 నాటికి రూ.1.56 లక్షల కోట్లు
ABN , First Publish Date - 2022-09-11T09:46:38+05:30 IST
5జీ సేవలందించేందుకు అవసరమైన ఆధునిక మౌలిక వసతుల ఏర్పాటు కోసం భారత టెలికాం కంపెనీలు 2025 నాటికి 1,950 కోట్ల డాలర్ల (సుమారు రూ.1.56 లక్షల కోట్లు) మేర పెట్టుబడులు పెట్టవచ్చని జీఎ్సఎంఏ తాజా నివేదిక అంచనా వేసింది.

5జీ ఇన్ఫ్రా కోసం టెల్కోల పెట్టుబడులపై జీఎస్ఎంఏ అంచనా
న్యూఢిల్లీ: 5జీ సేవలందించేందుకు అవసరమైన ఆధునిక మౌలిక వసతుల ఏర్పాటు కోసం భారత టెలికాం కంపెనీలు 2025 నాటికి 1,950 కోట్ల డాలర్ల (సుమారు రూ.1.56 లక్షల కోట్లు) మేర పెట్టుబడులు పెట్టవచ్చని జీఎ్సఎంఏ తాజా నివేదిక అంచనా వేసింది. 5జీ సేవలు భారత ఆర్థిక వ్యవస్థను 2023-40 మధ్య కాలంలో 45,500 కోట్ల డాలర్ల మేర పెంచవచ్చని.. 2040 జీడీపీ అంచనాలో ఇది 0.6 శాతానికి సమానమని రిపోర్టు పేర్కొంది. దేశంలో అతిపెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్ జియో ఈ దీపావళి నాటికి 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. నెలరోజుల్లో సర్వీసులు ప్రారంభిస్తామని ఎయిర్టెల్ స్పష్టం చేసింది.