అమ్మకానికి 13 బంగారు గనులు

ABN , First Publish Date - 2022-08-15T10:11:34+05:30 IST

దేశంలోని 13 బంగారం గనులు విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ గనులు ఆంధ్రప్రదేశ్‌ (10), ఉత్తరప్రదేశ్‌ (3) రాష్ర్టాల్లోనే ఉన్నాయి.

అమ్మకానికి 13 బంగారు గనులు

8 ఏపీలో 10, యూపీలో 3

న్యూఢిల్లీ: దేశంలోని 13 బంగారం గనులు విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ గనులు ఆంధ్రప్రదేశ్‌ (10), ఉత్తరప్రదేశ్‌ (3) రాష్ర్టాల్లోనే ఉన్నాయి. జాతీయోత్పత్తిలో (జీడీపీ) మైనింగ్‌ రంగం వాటా పెంచాలనే లక్ష్యం తో ప్రభుత్వం ఈ దిశగా కృషి చేస్తున్నట్టు చెబుతున్నారు. 

ఏపీలోని గనులివే: రామగిరి నార్త్‌ బ్లాక్‌, బొకసంపల్లి నార్త్‌ బ్లాక్‌, బొకసంపల్లి సౌత్‌ బ్లాక్‌; జవకుల-ఎ, జవకుల-బి, జవకుల-సి, జవకుల-డి, జవకుల-ఒ, జవకుల-ఎఫ్‌ బ్లాక్‌లు. ఈ 10 బంగారు గనుల్లో 5 గనుల వేలం ఆగస్టు 26న, మరో 5 గనుల వేలం ఆగస్టు 29న నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఈ గనుల కొనుగోలుకు ఆసక్తి గల వారి నుంచి టెండర్లు ఆహ్వానిస్తూ మార్చిలో నోటీసు వెలువడింది. 


యూపీలోని గనులివే: సోనాపహాడి బ్లాక్‌, సోనాభద్రలోని ధ్రువ-బైదానంద్‌ బ్లాక్‌లు. వీటి వేలం ఈ నెలలోనే జరగవచ్చు. ఆసక్తి గల వర్గాల నుంచి టెండర్లు ఆహ్వానిస్తూ మే 21 నోటిఫికేషన్‌ జారీ చేశారు. వేలం ఎప్పుడు నిర్వహించేది స్పష్టమైన తేదీ ఏదీ ప్రకటించలేదు. రాష్ర్టాలు ఇప్పటికే 199 మినరల్‌ బ్లాక్‌లు వేలం వేశాయి. గనుల చట్టాన్ని 2015 సంవత్సరంలో సవరించడం ద్వారా గనుల వేలం ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. గత ఆర్థిక సంవత్సరంలో 45 మినరల్‌ బ్లాక్‌లు విక్రయించాయి. మినరల్‌ బ్లాక్‌లు వేలం వేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయంలో మంచి వాటా పొందుతున్నాయని కేంద్రం చెబుతోంది. 

Read more