నాన్నను కుట్ర చేసి చంపారు

ABN , First Publish Date - 2022-09-19T10:11:36+05:30 IST

దివంగత ముఖ్యమంత్రి వైఎ్‌సఆర్‌ను కుట్ర చేసి చంపారు. నన్ను కూడా అలాగే చంపుతారేమో.. కానీ నా ఊపిరి ఉన్నంత వరకు ప్రజల నుంచి వేరు చేయడం ఎవరి తరమూ కాదు’ అంటూ వైఎ్‌సఆర్‌ తెలంగాణ పార్టీ

నాన్నను కుట్ర చేసి చంపారు

నన్నూ అలాగే చంపుతారేమో

వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు

దమ్ముంటే అరెస్ట్‌ చేయాలని సవాల్‌


మహబూబ్‌నగర్‌, జడ్చర్ల (ఆంధ్రజ్యోతి), సెప్టెంబరు 18 : ‘దివంగత ముఖ్యమంత్రి వైఎ్‌సఆర్‌ను కుట్ర చేసి చంపారు. నన్ను కూడా అలాగే చంపుతారేమో.. కానీ నా ఊపిరి ఉన్నంత వరకు ప్రజల నుంచి వేరు చేయడం ఎవరి తరమూ కాదు’ అంటూ వైఎ్‌సఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆదివారం మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలం మోదంపల్లి, పెద్దరేవల్లి, బోడగుట్టతండా, గౌతాపూర్‌, బాలానగర్‌, మోతీఘనపూర్‌లలో కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లెలగడ్డ తండా వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిపై మాట్లాడకుండా తన గొంతు నొక్కుతున్నారని ధ్వజమెత్తారు.


‘గుర్తుంచుకోండి కేసీఆర్‌... నా పేరు షర్మిల, వైఎ్‌సఆర్‌ బిడ్డని, ఈ బేడీలంటే నాకు భయమా, ఈ బేడీలు నన్ను ఆపుతాయా, మీకు దమ్ముందా, నన్ను అరెస్ట్‌ చేస్తారా.. నన్ను అరెస్ట్‌ చేయండి’ అని బేడీలు చూపుతూ సవాల్‌ విసిరారు. ‘మీ పోలీసులను పంపించండి.. కేసులు పెట్టారు కదా. కంప్లైంట్లు చేశారు కదా, నేను రెడీ, మీరు రెడీయా...’ అన్నారు. మీకు పోలీసులుంటే, నాకు ప్రజలున్నారు. నాకు బేడీలంటే భయంలేదు. నేను జనంలో ఉన్నానని, జనం కోసమే పాదయాత్ర చేస్తున్నానని పునరుద్ఘాటించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు రాంరెడ్డి, ఏపూరి సోమన్న, సత్యవతి, సరోజ్‌రెడ్డి పాల్గొన్నారు. కాగా, మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఆదివారం షర్మిల పాదయాత్ర ముగిసింది. సోమవారం నుంచి ఆమె రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో పర్యటించనున్నారు. 

Read more